చింతకాయల అరెస్ట్ పై స్టే ఇచ్చిన హైకోర్టు
మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన్ను అరెస్ట్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఇచ్చింది. నర్సీపట్నం మహిళా కమిషనర్ తోట కృష్ణవేణిని… బట్టలూడదీస్తామంటూ బెదిరించిన కేసులో అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు నమోదైంది. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. కానీ ఆయన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని అందుబాటులో లేకుండా పోయారు. పోలీసుల అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో అయ్యన్నపాత్రుడు హైకోర్టును ఆశ్రయించారు. తనపై కేసు కొట్టివేయాలని, తనను అరెస్ట్ చేయకుండా కాపాడాలని హైకోర్టును కోరారు. దాంతో […]

మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన్ను అరెస్ట్ చేయకుండా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టే ఇచ్చింది.
నర్సీపట్నం మహిళా కమిషనర్ తోట కృష్ణవేణిని… బట్టలూడదీస్తామంటూ బెదిరించిన కేసులో అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు నమోదైంది. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. కానీ ఆయన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకుని అందుబాటులో లేకుండా పోయారు.
పోలీసుల అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో అయ్యన్నపాత్రుడు హైకోర్టును ఆశ్రయించారు. తనపై కేసు కొట్టివేయాలని, తనను అరెస్ట్ చేయకుండా కాపాడాలని హైకోర్టును కోరారు. దాంతో చింతకాయల అయ్యన్నపాత్రుడిని పోలీసులు అరెస్ట్ చేయకుండా కోర్టు స్టే ఇచ్చింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.