Telugu Global
Cinema & Entertainment

రానా పెళ్లి సంబరాలు షురూ

రానా-మిహీకాల రోకా సెర్మనీ (కుటుంబాల్ని పరిచయం చేసుకునే కార్యక్రమం) ఆల్రెడీ ముగిసింది. ఇప్పుడు వీళ్ల పెళ్లికి సంబంధించి ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. మిహీకా స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టింది. సంప్రదాయ దుస్తులు ధరించిన మిహీకా లేటెస్ట్ ఫొటోను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్లు ప్రారంభమయ్యాయనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించింది. రానా-మిహీకాల పెళ్లి ఆగస్ట్ 8న జరగనుంది. ఈ విషయాన్ని సురేష్ బాబు స్వయంగా ప్రకటించారు. నిజానికి కరోనా వైరస్ కారణంగా ఆగస్ట్ 8న జరగాల్సిన […]

రానా పెళ్లి సంబరాలు షురూ
X

రానా-మిహీకాల రోకా సెర్మనీ (కుటుంబాల్ని పరిచయం చేసుకునే కార్యక్రమం) ఆల్రెడీ ముగిసింది. ఇప్పుడు వీళ్ల పెళ్లికి సంబంధించి ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ప్రారంభమయ్యాయి. మిహీకా స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టింది. సంప్రదాయ దుస్తులు ధరించిన మిహీకా లేటెస్ట్ ఫొటోను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్లు ప్రారంభమయ్యాయనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించింది.

రానా-మిహీకాల పెళ్లి ఆగస్ట్ 8న జరగనుంది. ఈ విషయాన్ని సురేష్ బాబు స్వయంగా ప్రకటించారు. నిజానికి కరోనా వైరస్ కారణంగా ఆగస్ట్ 8న జరగాల్సిన పెళ్లి వాయిదా పడే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చినప్పటికీ.. అనుకున్న తేదీకే పెళ్లి జరిపిస్తామని సురేష్ బాబు మరోసారి ప్రకటించడంతో పుకార్లు ఆగిపోయాయి.

ఇక పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్ టైపులో విదేశాల్లో లేదా ఇండియాలోనే ఓ పర్యాటక ప్రాంతంలో చేయాలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్ వ్యాప్తి ఉత్తరాదిన మరింత ఎక్కువగా ఉండడంతో.. రిస్క్ తీసుకోవడం ఇష్టంలేక హైదరాబాద్ లోనే పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఫలక్ నుమా ప్యాలెస్ ను అద్దెకు తీసుకున్నట్టు తెలుస్తోంది.

చూస్తుంటే.. రానా వివాహం అత్యంత వైభవంగా జరిగేలా కనిపిస్తోంది. కాస్ట్ లీ వెడ్డింగ్స్ లో ఒకటిగా ఇది నిలిచిపోతుందేమో. ఎందుకంటే మిహీకా బజాజ్ ఫ్యామిలీ అలాంటిది మరి.

First Published:  21 Jun 2020 3:30 PM IST
Next Story