బీజేపీ వైపు రఘురామ చూపు.... అసలు కారణం అదేనా ?
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్ అయింది. ఎంపీ చేసిన విమర్శలపై పార్టీ నేతలు ఘాటుగా స్పందించారు. ఇంకా కొంతమంది స్పందిస్తున్నారు. ఏడాది కాలంలో తొలి ఆరు నెలలు సైలెంట్‌గా ఉన్న ఎంపీ… ఒక్కసారిగా ఈమధ్య స్వరం పెంచడానికి గల కారణాలు ఏంటి అని పలువురు ఆరా తీస్తున్నారు. బీజేపీలో చేరేందుకు రఘురామకృష్ణంరాజు ప్రయత్నిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన బీజేపీకి దగ్గరకావాడానికి చేస్తున్న ప్రయత్నాలకు అసలు కారణం ఓ కేసు అని […]
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్ అయింది. ఎంపీ చేసిన విమర్శలపై పార్టీ నేతలు ఘాటుగా స్పందించారు. ఇంకా కొంతమంది స్పందిస్తున్నారు. ఏడాది కాలంలో తొలి ఆరు నెలలు సైలెంట్‌గా ఉన్న ఎంపీ… ఒక్కసారిగా ఈమధ్య స్వరం పెంచడానికి గల కారణాలు ఏంటి అని పలువురు ఆరా తీస్తున్నారు.
బీజేపీలో చేరేందుకు రఘురామకృష్ణంరాజు ప్రయత్నిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన బీజేపీకి దగ్గరకావాడానికి చేస్తున్న ప్రయత్నాలకు అసలు కారణం ఓ కేసు అని తెలుస్తోంది. 2010లో ఈస్ట్ కోస్ట్ పవర్ పేరు మీద రఘురామకృష్ణమరాజుకు ఓ ప్రాజెక్టు వచ్చింది. దీని మీద 947 కోట్ల రూపాయల లోన్ తీసుకున్నారు. ఆ లోన్ తీర్చలేదు. దీంతో ఆయన పై కేసు నమోదైంది. న్యూఢిల్లీలోని ఎకానామిక్ ఆఫీస్ వింగ్‌లో కేసు ఫైల్ అయింది. ఈ కేసుల నెంబర్ 196/18. ఇప్పుడు ఈ కేసు విచారణకు వచ్చింది.
దీంతో రాజు గారు ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారట. ఈ కేసు ఫైల్ కాకుండా ఉండేందుకు చాలా ప్రయత్నాలే చేశారట.
ఎన్నికల ముందే చంద్రబాబుతో కలిసి రఘురామకృష్ణరాజు ఓ డీల్ చేసుకున్నారట. ప్రాజెక్ట్ వాల్యుయేషన్ 1200 కోట్లకు పెంచారట. అయితే అప్పట్లో ఎందుకో ముందుకు సాగలేదు. ఈలోపు ఎన్నికలు రావడం… టీడీపీ టికెట్ ఇవ్వకపోడంతో వైసీపీలో చేరారు. నరసాపురం నుంచి ఎంపీగా గెలిచారు. ఆతర్వాత సీఎం జగన్‌ను కలిశారు.
అప్పటికే థర్మల్ పవర్ యూనిట్ ధర తగ్గింది. కానీ యూనిట్ ధర ఐదు రూపాయల కంటే ఎక్కువ పెట్టి కొనాలని జగన్‌పై ఒత్తిడి తెచ్చారట. అయితే అందుకు జగన్ ఒప్పుకోలేదట. మిగతా కంపెనీలకు ఇచ్చే రేటు ఇస్తామని చెప్పారట. సొంత పార్టీ ఎంపీయైనా…కేవీపీ వియ్యంకుడు అని తెలిసినా కూడా జగన్ అందుకు ఒప్పుకోలేదు. దీంతో అప్పటి నుంచి అలిగిన రఘురామకృష్ణంరాజు పార్టీపై ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు.
ఇప్పుడు కేసు విచారణకు రావడంతో మళ్లీ వాయిస్ పెంచారు. సీఎంతో పదినిమిషాలు అపాయింట్‌మెంట్ ఇప్పించాలని తనకు తెలిసిన మంత్రులను కోరుతున్నారట. ఈ కేసు నుంచి బయటపడేందుకు ఆయన అపాయింట్‌మెంట్ కోరుతున్నట్లు సమాచారం. అయితే ఆయన చేయాల్సిదంతా చేసి…ఎల్లో మీడియాలో ప్రచారం పొంది…ఇప్పుడు అపాయింట్‌మెంట్ అడిగితే సీఎం ఎలా ఇస్తారనేది మంత్రుల ప్రశ్న.
ఇటు బీజేపీ కూడా ఈయనపై ఆసక్తి లేదనేది హస్తినవర్గాల సమాచారం. ఫిరాయింపు ఎంపీని తమ పార్టీలో చేర్చుకున్న చెడ్డపేరుతో పాటు… ఈయనకు కేడర్ లేకపోవడం మరో మైనస్. చంద్రబాబు చెప్పిన ప్లాన్‌ను అమలు చేసి ఇప్పుడు రఘురామకృష్ణమరాజు రెంటికి చెడ్డ రేవడి అయ్యారనే ప్రచారం పార్టీలో నడుస్తోంది.