Telugu Global
National

కాళేశ్వరానికి నేటితో ఏడాది పూర్తి... దీని నిర్మాణంలో 'మేఘా'దే కీర్తి

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరాన్ని ప్రారంభించి ఈరోజుకి ఏడాది పూర్తయింది. 2019 జూన్‌ 21న ముగ్గురు ముఖ్యమంత్రుల సమక్షంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ ఏడాది కాలంలో మొత్తం పది పంపు హౌస్ లు పూర్తికాగా అందులో 4,767 మెగావాట్ల సామర్ధ్యంతో 9 పంపు హౌస్‌ లను మేఘా నిర్మించడం వరల్డ్‌ రికార్డ్‌. అతి కొద్దిరోజుల్లోనే 618 మీటర్ల ఎత్తుకు 70 టీఎంసీల నీళ్ళను ఎత్తిపోసేలా పంపు హౌస్‌లను నిర్మించి మేఘా ప్రపంచ రికార్డ్‌ సృష్టించింది. ప్రపంచంలోనే […]

కాళేశ్వరానికి నేటితో ఏడాది పూర్తి... దీని నిర్మాణంలో మేఘాదే కీర్తి
X

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరాన్ని ప్రారంభించి ఈరోజుకి ఏడాది పూర్తయింది. 2019 జూన్‌ 21న ముగ్గురు ముఖ్యమంత్రుల సమక్షంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ ఏడాది కాలంలో మొత్తం పది పంపు హౌస్ లు పూర్తికాగా అందులో 4,767 మెగావాట్ల సామర్ధ్యంతో 9 పంపు హౌస్‌ లను మేఘా నిర్మించడం వరల్డ్‌ రికార్డ్‌. అతి కొద్దిరోజుల్లోనే 618 మీటర్ల ఎత్తుకు 70 టీఎంసీల నీళ్ళను ఎత్తిపోసేలా పంపు హౌస్‌లను నిర్మించి మేఘా ప్రపంచ రికార్డ్‌ సృష్టించింది.

ప్రపంచంలోనే భారీ బహుళ ఎత్తిపోతల పథకం కాళేశ్వరంలో అత్యధిక పంపింగ్‌ కేంద్రాలను మేఘా పూర్తిచేసి తన ఇంజినీరింగ్‌ శక్తిసామర్ధ్యాలు, నైపుణ్యాన్ని చాటిచెప్పింది. ఈ ఎత్తిపోతల పథకంలో కీలకమైన పనులు, అత్యధిక పంపింగ్‌ కేంద్రాలను రికార్డు సమయంలో పూర్తి చేసిన ఘనత మేఘాది.

కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకంలో మొత్తం 22 పంపింగ్‌ కేంద్రాల్లో 96 మెషీన్లు 4680 మెగావాట్లతో నెలకొల్పుతున్నారు. అందులో 15 కేంద్రాల్లో 3840 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన 89 మెషీన్లను మేఘ నెలకొల్పింది. నీటి ఎత్తిపోతల కోసం ప్రపంచంలో ఇంతకు ముందెన్నడూ ఇంతటి భారీ పంపింగ్‌ కేంద్రాలు ఏర్పాటు కాలేదు.

ఇప్పటికే 10 పంపింగ్‌ కేంద్రాల నిర్మాణం పూర్తై వినియోగంలోకి వచ్చాయి. అందులో 9 కేంద్రాలు మేఘా నిర్మించినవే. 15 పంపింగ్‌ కేంద్రాల్లో 11 భూఉపరితలంలో, మిగిలిన 4 భూగర్భంలో మేఘా నిర్మించింది. రోజు 2 టీఎంసీల నీటిని పంపింగ్‌ చేసేలా నిర్మించిన ఈ పంపింగ్‌ కేంద్రాల్లో 3840 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన మెషీన్లను మేఘా ఏర్పాటు చేసింది.

భూగర్భంలో ఉన్న గాయత్రి, అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌ పంపింగ్‌ కేంద్రాలను మేఘా నిర్మించింది. అతి పెద్దదైన భూగర్భ పంపింగ్‌ కేంద్రం గాయత్రి పంప్‌హౌస్‌ వైశాల్యం 84753.2 చదరపు అడుగులు. దీనికి అనుసంధానంగా రూపొందించిన సర్జ్‌పూల్‌, అదనపు సర్జ్‌పూల్‌ కూడా ప్రపంచంలోనే పెద్దవి.

రంగనాయక సాగర్‌లో ఒక్కొక్కటి 134 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4 మెషీన్లను మేఘా ఏర్పాటు చేసింది. గాయత్రి పంప్‌ హౌస్‌ మెషీన్ల తర్వాత అతి భారీ సామర్ధ్యంతో కూడిన పంపింగ్‌ యూనిట్‌ ఇదే.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కోసం అతి విస్తృతమైన విద్యుత్‌ సరఫరా వ్యవస్థను మేఘా ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రపు విద్యుత్‌ సరఫరా వ్యవస్థ సామర్ధ్యం 15,087 మెగావాట్లు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మేఘా నెలకొల్పిన సరఫరా వ్యవస్థ మొత్తం తెలంగాణ విద్యుత్‌ సరఫరా వ్యవస్థలో 25 శాతం కంటే ఎక్కువే ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టు అవసరమైన మొత్తం విద్యుత్‌ 4680 మెగావాట్లు. ఇందులో అత్యధికంగా 3840 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా వ్యవస్థను మేఘా ఏర్పాటు చేసింది. భారతదేశంలోని ఏడు ఈశాన్య రాష్ట్రాల విద్‌యుత్‌ సరఫరా సామర్ధ్యం 3916 మెగావాట్లు మాత్రమే. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మేఘా ఏర్పాటు చేసిన విద్యుత్‌ సరఫరా వ్యవస్థకు దానికి దాదాపు సమానం.

కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి ఎత్తిపోత మొదలయ్యే లక్ష్మి పంప్‌ హౌస్ ప్రారంభించిన నాటి నుంచి గత సీజన్‌లో 61.44 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసింది. సరస్వతి పంప్‌హౌస్‌ నుంచి 56.27 టీఎంసీల నీటి పంపింగ్‌ జరిగింది. పార్వతి పంప్‌ హౌస్‌ 53.77 టీఎంసీల నీటిని ఎగువకు ఎత్తిపోసింది. ప్రపంచంలోనే అతి పెద్దదైనా గాయత్రి పంప్‌ హౌస్‌ ఏకంగా 66 టీఎంసీల గోదావరి జలాలను పంపింగ్‌ చేసింది. అన్నపూర్ణ పంపింగ్‌ కేంద్రం 6.66 టీఎంసీలు, రంగనాయకసాగర్‌ పంపింగ్‌ కేంద్రం 4.84 టీఎంసీలు, మలన్నసాగర్‌ పంపింగ్‌ కేంద్రం 2.07 టీఎంసీల నీటిని పంపింగ్‌ చేశాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో చివరి దశ అయిన కొండపోచమ్మ సాగర్‌కు నీటిని పంపింగ్ చేసేందుకు ఏర్పాటు చేసిన అక్కారం, మర్కూక్‌ జంట పంప్‌ హౌసులు 2.44 టీఎంసీల నీటిని ఎత్తిపోశాయి.

First Published:  21 Jun 2020 3:06 AM GMT
Next Story