బాబు, రెండు పత్రికలపై పరువు నష్టం దావాలు
ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా కథనాలు ప్రచురించారంటూ పత్రికలపై ఏపీ ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. సరస్వతి పవర్ సంస్థకు గనుల లీజు పొడిగింపు వ్యవహారంలో గనుల శాఖ లీగల్ నోటీసులు ఇచ్చింది. సరస్వతి పవర్‌కు గనుల లీజును 50ఏళ్లు పొడిగించగా… ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు దురుద్దేశంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా కథనాలు రాశాయని అందుకే లీగల్ నోటీసులు పంపినట్టు గోపాలకృష్ణ ద్వివేది వివరించారు. […]
ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా కథనాలు ప్రచురించారంటూ పత్రికలపై ఏపీ ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి.
సరస్వతి పవర్ సంస్థకు గనుల లీజు పొడిగింపు వ్యవహారంలో గనుల శాఖ లీగల్ నోటీసులు ఇచ్చింది. సరస్వతి పవర్‌కు గనుల లీజును 50ఏళ్లు పొడిగించగా… ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు దురుద్దేశంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా కథనాలు రాశాయని అందుకే లీగల్ నోటీసులు పంపినట్టు గోపాలకృష్ణ ద్వివేది వివరించారు.
సరస్వతీ పవర్‌కు గనుల లీజు కేటాయింపు వందకు వంద శాతం నిబంధనల ప్రకారమే జరిగిందని…ఈ విషయం చంద్రబాబునాయుడికి కూడా తెలుసని… అయినప్పటికీ కుట్రపూరితంగా ఆయన ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేశారని ద్వివేది వివరించారు. 15 రోజుల్లోగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని… లేనిపక్షంలో పరువు నష్టం దావా వేస్తామని… సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని లీగల్ నోటీసుల్లో హెచ్చరించారు.
ఖండనను ఈనాడు పత్రిక ప్రచురించినా అది సంతృప్తికరంగా లేదని… మరో పత్రిక అసలు ఖండనను కూడా ప్రచురించలేదన్నారు గోపాలకృష్ణ ద్వివేది. ప్రభుత్వ పత్రిష్ట దెబ్బతీసేలా ఆరోపణలను ప్రచురించిన పత్రికలు … ప్రభుత్వ వాదనకు మాత్రం చోటివ్వడం లేదన్నారు. కేవలం ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మాత్రమే ప్రచురిస్తున్నాయని గోపాలకృష్ణ ద్వివేది వ్యాఖ్యానించారు.
పౌరసరఫరాల శాఖ నాణ్యమైన బియ్యం పంపిణీ కోసం అవసరమైన సంచులను ఎలాంటి టెండర్లు పిలవకుండానే జగన్‌మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీ నుంచి కోనుగోలు చేశారంటూ ఆరోపణ చేసినందుకు చంద్రబాబునాయుడికి,ఆ వార్తను ప్రచురించినందుకు ఈనాడు వ్యవస్థాపకుడు రామోజీరావు, పత్రిక ఎడిటర్ నాగేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వం లీగల్ నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఏడు రోజుల్లోగా క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది.
సంచుల కొనుగోలు కోసం పౌరసరఫరాల శాఖ గత ఏడాది డిసెంబర్3న ఈనాడుతో పాటు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికలో టెండర్ ప్రకటన జారీ చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. పక్కాగా టెండర్ నిర్వహించే సంచులు కొనుగోలు చేసినట్టు చెబుతోంది.
అయినప్పటికీ టెండర్లు లేకుండానే సొంత సంస్థ నుంచి సంచులు సరఫరా చేస్తున్నారంటూ చంద్రబాబునాయుడు ఆరోపించడం, ఎలాంటి ఆధారాలు లేకుండానే ఈనాడు పత్రిక యథాతథంగా దాన్ని ప్రచురించిందని ప్రభుత్వం చెబుతోంది.