Telugu Global
NEWS

అన్‌లాక్‌ తర్వాతే ఏపీలో కరోనా పెరిగిందా?

ఏపీలో కరోనా పంజా విసురుతోంది. శనివారం 390 కేసులు పాజిటివ్‌ వచ్చాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసులు 6620కి చేరాయి. అయితే ఏపీలో కేసులు ఒక్కసారిగా ఎందుకు పెరుగుతున్నాయి? వీటి వెనుక ఉన్న కారణాలేంటి? పరిశీలిస్తే ఓ విషయం బయటపడింది. అన్‌లాక్‌ తర్వాత ఏపీలో ప్రతిరోజూ సగటున 238 కేసులు నమోదు అవుతున్నాయి. ఇదే లాక్‌ డౌన్‌ కాలంలో ప్రతిరోజూ సగటు 54 కేసులు. లాక్‌డౌన్‌ విధించే సమయానికి ఏపీలో 8 పాజిటివ్‌ కేసులు మాత్రమే ఉండేవి. […]

అన్‌లాక్‌ తర్వాతే ఏపీలో కరోనా పెరిగిందా?
X

ఏపీలో కరోనా పంజా విసురుతోంది. శనివారం 390 కేసులు పాజిటివ్‌ వచ్చాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసులు 6620కి చేరాయి. అయితే ఏపీలో కేసులు ఒక్కసారిగా ఎందుకు పెరుగుతున్నాయి? వీటి వెనుక ఉన్న కారణాలేంటి? పరిశీలిస్తే ఓ విషయం బయటపడింది.

అన్‌లాక్‌ తర్వాత ఏపీలో ప్రతిరోజూ సగటున 238 కేసులు నమోదు అవుతున్నాయి. ఇదే లాక్‌ డౌన్‌ కాలంలో ప్రతిరోజూ సగటు 54 కేసులు.

లాక్‌డౌన్‌ విధించే సమయానికి ఏపీలో 8 పాజిటివ్‌ కేసులు మాత్రమే ఉండేవి. మార్చి 25న లాక్‌డౌన్‌ విధించారు. ఏప్రిల్‌ 14 వరకు తొలి లాక్‌డౌన్‌ కొనసాగింది. ఈ 21 రోజుల టైమ్‌లో కేసులు 495కి పెరిగాయి.

ఆతర్వాత లాక్‌డౌన్‌ 2.0… 19 రోజులు నడిచింది. ఈ కాలంలో కేసులు 1147 బయటపడ్డాయి. మే 17 నాటికి కొనసాగిన మరో లాక్‌డౌన్‌ 3లో 785 కేసులు నమోదు అయ్యాయి. మొత్తం కేసులు 2432.

లాక్‌డౌన్‌ 4… మే 18 నుంచి మే 31 వరకు కొనసాగింది. 14 రోజులు టైమ్‌. కానీ పాజిటివ్‌ కేసులు 1244. మొత్తం కేసులు 3,676 మాత్రమే. అయితే ఆ తర్వాత లాక్‌డౌన్‌ ముగిసింది. అన్‌లాక్‌ ప్రారంభమైంది. జనాలు రోడ్డు మీదకు వచ్చారు. అంతే కేసులు ఒక్కసారిగా పెరిగాయి.

జూన్‌ 1 నుంచి జూన్‌ 20 వరకు ఏపీలో 4,776 కేసులు పెరిగాయి. ఈ మొత్తం కేసులు 8452కి చేరాయి. 78 రోజుల లాక్‌డౌన్‌ కాలంలో నమోదైన కేసులు 3676. కానీ అన్‌లాక్‌ పీరియడ్‌ 20 రోజుల్లోనే 4,776 కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది.

ఈ 20 రోజుల్లో కేసులు పెరగడంతో మూడు జిల్లాల్లో మళ్లీ లాక్‌డౌన్‌ విధించింది. శ్రీకాకుళం జిల్లా పలాస, ప్రకాశం జిల్లా ఒంగోలు, అనంతపురం పట్టణంలో 14 రోజుల పాటు లాక్‌డౌన్‌ పెట్టారు. కేసులు పెరిగే పట్టణాల్లో లాక్‌ డౌన్‌తో కంట్రోల్‌ చేయగలమని అధికారులు భావిస్తున్నారు.

ఇప్పటికే తమిళనాడులో నాలుగు ప్రాంతాల్లో ఇదే విధానాన్ని ఫాలో అవుతున్నారు. కేసులు ఎక్కువగా ఉన్న చెన్నైలో కర్ఫ్యూ పెట్టారు. దీంతో ఇక్కడ కనీసం ఎలాంటి షాపులు తెరవడం లేదు.

First Published:  20 Jun 2020 9:19 PM GMT
Next Story