Telugu Global
International

ఒక వైపు నిషేధపు డిమాండ్.. నిమిషాల్లో అమ్ముడు పోయిన చైనా ఫోన్

ఇండో-చైనా సరిహద్దు గల్వాన్ లోయ వద్ద ఇరు చేశాల సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత చైనా సంస్థలను, వస్తువులు నిషేధించాలనే డిమాండ్ పెరిగిపోయింది. చాలా మంది వీధుల్లో టీవీలు, దోమల బ్యాట్లు, ఫోన్లు పగలగొట్టి తమ నిరసన తెలియజేశారు. రైల్వేశాఖ చైనాసంస్థకు ఇచ్చిన కాంట్రాక్టును కూడా రద్దు చేసింది. మరోవైపు ఇండియాలో చైనాకు చెందిన బీబీకే ఎలక్ట్రానిక్స్ సంస్థ కొత్తగా […]

ఒక వైపు నిషేధపు డిమాండ్.. నిమిషాల్లో అమ్ముడు పోయిన చైనా ఫోన్
X

ఇండో-చైనా సరిహద్దు గల్వాన్ లోయ వద్ద ఇరు చేశాల సైనికుల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత చైనా సంస్థలను, వస్తువులు నిషేధించాలనే డిమాండ్ పెరిగిపోయింది. చాలా మంది వీధుల్లో టీవీలు, దోమల బ్యాట్లు, ఫోన్లు పగలగొట్టి తమ నిరసన తెలియజేశారు. రైల్వేశాఖ చైనాసంస్థకు ఇచ్చిన కాంట్రాక్టును కూడా రద్దు చేసింది.

మరోవైపు ఇండియాలో చైనాకు చెందిన బీబీకే ఎలక్ట్రానిక్స్ సంస్థ కొత్తగా విడుదల చేసిన వన్ ప్లస్ 8 ప్రో మోడల్ సెల్‌ఫోన్ నిమిషాల్లో అమ్ముడు పోయింది. ఆన్‌లైన్‌లో పెట్టిన స్టాక్ కొనడానికి భారతీయులు పోటీ పడ్డారు.

గతంలో కూడా వన్ ప్లస్ మోడల్ ఫోన్లు ఇలాగే అమ్ముడు పోయాయి. అయితే గల్వాన్ ఘటన నేపథ్యంలో అమ్మకాలపై ప్రభావం పడుతుందేమోనని కంపెనీ భావించింది. కానీ కంపెనీ భయపడినట్లు కాకుండా ఎప్పటిలాగే సెల్‌ఫోన్లు అమ్ముడు పోయాయి.

ఇక చైనాకు చెందిన మరో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ షావోమీ రెండు ల్యాప్‌టాప్‌ మోడల్స్ విడుదల చేయగా రెండు రోజుల్లోనే పూర్తి స్టాక్ అమ్ముడు పోయింది. చైనా స్మార్ట్ ఫోన్లకు ఇండియాలో ఉన్న డిమాండ్ ఎప్పటికీ తగ్గదని విశ్లేషకులు భావిస్తున్నారు.

చైనాకు చెందిన పలు కంపెనీలు భారతీయులను దృష్టిలో పెట్టుకునే తమ ఉత్పత్తులను రూపొందిస్తున్నాయి. రియల్‌మీ సంస్థ ఇండియా సీఈవో మాధవ్ సేథ్ మాట్లాడుతూ.. రియల్‌మీ కంపెనీ ఒక ఇండియన్ స్టార్ అప్ అని గర్వంగా చెప్పగలను అని చెప్పారు. వాస్తవానికి ఇది చైనాకు చెందిన బీబీకే ఎలక్ట్రానిక్స్ సబ్సిడరీ. అయినా సరే భారత్‌లో రియల్‌మీ చాలా పెద్ద విజయం సాధించింది.

ఇక ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి భారతీయ స్మార్ట్‌ఫోన్ కంపెనీ మైక్రోమ్యాక్స్ తిరిగి మార్కెట్‌లో కొత్త ఉత్పత్తులు విడుదల చేయబోతోంది.

First Published:  20 Jun 2020 8:17 AM IST
Next Story