Telugu Global
NEWS

ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ రోజు రోజుకూ పెరిగిపోతుండటంతో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నిర్వహించాల్సిన పదో తరగతి పరీక్షలతో పాటు, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా రద్దు చేసింది. విద్యార్థుల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఈ ఏడాది ఇంటర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ కింద పరిగణిస్తున్నట్లు […]

ఏపీలో పదో తరగతి పరీక్షలు రద్దు
X

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ రోజు రోజుకూ పెరిగిపోతుండటంతో పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నిర్వహించాల్సిన పదో తరగతి పరీక్షలతో పాటు, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా రద్దు చేసింది.

విద్యార్థుల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఈ ఏడాది ఇంటర్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులను పాస్ కింద పరిగణిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఇప్పటికే తెలంగాణలో కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసి.. ఇంటర్నల్స్ ఆధారంగా మార్కులు కేటాయిస్తూ మెమోలు కూడా జారీ చేసిన విషయం తెలిసిందే

First Published:  20 Jun 2020 12:27 PM IST
Next Story