చంద్రబాబు ఇంత దిగజారుతారని అనుకోలేదు....
తనను పార్టీ నుంచి సస్పండ్ చేసి.. ఇప్పుడు పార్టీకి అనుకూలంగా ఓటేయమని విప్ జారీ చేయడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. టీడీపీ తనను సస్పెండ్ చేసిన తర్వాత అసెంబ్లీ స్పీకర్ తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించారని.. కానీ ఇవాళ రాజ్యసభ ఎన్నికలో ఓటేయడానికి వస్తే అభ్యంతరం ఎలా తెలుపుతారని ఆయన ప్రశ్నించారు. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఏపీ అసెంబ్లీకి వచ్చిన వల్లభనేని వంశీ మీడియాతో మాట్లాడారు. కరోనా కాలంలో రాజ్యసభ ఎన్నికలు […]
తనను పార్టీ నుంచి సస్పండ్ చేసి.. ఇప్పుడు పార్టీకి అనుకూలంగా ఓటేయమని విప్ జారీ చేయడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు.
టీడీపీ తనను సస్పెండ్ చేసిన తర్వాత అసెంబ్లీ స్పీకర్ తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించారని.. కానీ ఇవాళ రాజ్యసభ ఎన్నికలో ఓటేయడానికి వస్తే అభ్యంతరం ఎలా తెలుపుతారని ఆయన ప్రశ్నించారు. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఏపీ అసెంబ్లీకి వచ్చిన వల్లభనేని వంశీ మీడియాతో మాట్లాడారు.
కరోనా కాలంలో రాజ్యసభ ఎన్నికలు రావడానికి కారణం చంద్రబాబే అని విమర్శించారు. ఒక రాజ్యసభ సభ్యుడి ఎన్నికకు 35 మంది సభ్యుల బలం కావాలి. కానీ 23 మంది శాసన సభ్యులున్న టీడీపీ వర్ల రామయ్యను బరిలోకి దింపారు. అసలు గెలవని స్థానానికి ఎస్సీ వర్గానికి చెందిన వర్ల రామయ్యను బరిలోకి దింపి అవమాన పరిచారని వంశీ ఆరోపించారు. చంద్రబాబు పోటీ పెట్టడం వల్లే ఇవ్వాళ ఎన్నికలు జరుగుతున్నాయని.. లేకపోతే అన్నీ ఏకగ్రీవమయ్యేవేనని ఆయన అన్నారు.
ఇప్పటికైనా చంద్రబాబు ఇలాంటి పనులు మానుకోవాలని ఆయన సూచించారు. చంద్రబాబు త్వరలో ప్రతిపక్ష నేత హోదా కూడా కోల్పోతారని.. రాజ్యసభ సీట్లు ఓడిపోవడం ఆయనకు పెద్ద అవమానమేనని వంశీ అన్నారు.
175 ఎమ్మెల్యేలకు గాను 173 మంది ఓటింగ్
ఏపీలో ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈ రోజు అసెంబ్లీ ప్రాంగణంలో పోలింగ్ జరిగింది. ఉదయం 9 గంటల నుంచి 4 గంటలకు వరకు జరిగిన ఈ పోలింగ్‌లో 175 మందికి గాను 173 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ఉదయం సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు.. మధ్యాహ్నం సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈఎస్ఐ స్కాంలో అరెస్టయిన అచ్చెన్నాయుడును పోలింగ్‌కు అనుమతించలేదు. ఇక హోం క్వారంటైన్‌లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా ఓటు హక్కు వినియోగించుకోలేదు.
వైసీపీ తరపున పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని బరిలో ఉండగా, టీడీపీ తరపున వర్ల రామయ్య పోటీలో ఉన్నారు. సాయంత్రం 6 గంటలకు ఫలితాలు వెలువడనున్నాయి.