తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా గురువారం ఒక్కరోజే 352 కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటివరకూ నమోదైన కేసులు 6,027కి చేరాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 302 కేసులు బయటపడడంతో కలవరం మొదలైంది. రంగారెడ్డి 17, మేడ్చల్ 10 కేసులు కలిపితే 329. గ్రేటర్ పరిధిలో కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు ఆసుపత్రిలో 2531 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ కరోనాతో 195 మంది చనిపోయారు. మొత్తం డిశ్చార్జ్ అయిన […]

తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా గురువారం ఒక్కరోజే 352 కేసులు నమోదు అయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటివరకూ నమోదైన కేసులు 6,027కి చేరాయి.
జీహెచ్‌ఎంసీ పరిధిలో 302 కేసులు బయటపడడంతో కలవరం మొదలైంది. రంగారెడ్డి 17, మేడ్చల్ 10 కేసులు కలిపితే 329. గ్రేటర్ పరిధిలో కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
మరోవైపు ఆసుపత్రిలో 2531 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ కరోనాతో 195 మంది చనిపోయారు. మొత్తం డిశ్చార్జ్ అయిన వాళ్లు 3301 మంది.
తెలంగాణలో గ్రేటర్ పరిధిలో టెస్ట్‌ల సంఖ్య ప్రభుత్వం పెంచింది. దీంతో పాజిటివ్ కేసులు కూడా పెరిగాయి. పరీక్షలు పెంచితే మరిన్ని కేసులు పెరిగే అవకాశం కనిపిస్తోంది.