ఆర్ఆర్ఆర్ ట్రయల్ షూట్ వాయిదా...
తెలంగాణ ప్రభుత్వం షూటింగ్స్ కు అనుమతి ఇచ్చేసింది. లెక్కప్రకారం ఆర్ఆర్ఆర్ సినిమా ఈపాటికి సెట్స్ పైకి రావాలి. ట్రయల్ షూట్ పూర్తిచేయాలి. కానీ అలా జరగలేదు. ఆర్ఆర్ఆర్ ట్రయల్ షూట్ ను మరికొన్ని రోజులు వాయిదావేశాడు దర్శకుడు రాజమౌళి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి చాలామంది యూనిట్ సభ్యులు కావాలి. కానీ ప్రభుత్వం చెప్పినట్టు పరిమిత యూనిట్ తో షూట్ చేయడం రాజమౌళికి కష్టంగా మారింది. దీనికి తోడు ప్రస్తుతం హైదరాబాద్ లో […]
తెలంగాణ ప్రభుత్వం షూటింగ్స్ కు అనుమతి ఇచ్చేసింది. లెక్కప్రకారం ఆర్ఆర్ఆర్ సినిమా ఈపాటికి సెట్స్ పైకి రావాలి. ట్రయల్ షూట్ పూర్తిచేయాలి. కానీ అలా జరగలేదు. ఆర్ఆర్ఆర్ ట్రయల్ షూట్ ను మరికొన్ని రోజులు వాయిదావేశాడు దర్శకుడు రాజమౌళి.
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి చాలామంది యూనిట్ సభ్యులు కావాలి. కానీ ప్రభుత్వం చెప్పినట్టు పరిమిత యూనిట్ తో షూట్ చేయడం రాజమౌళికి కష్టంగా మారింది. దీనికి తోడు ప్రస్తుతం హైదరాబాద్ లో పరిస్థితులు కూడా ఏమంత అనుకూలంగా లేవు.
నగరంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ చేసి, ఎవరికైనా కరోనా సోకితే టోటల్ యూనిట్ కే చెడ్డ పేరు వస్తుంది. అందుకే ఆర్ఆర్ఆర్ ట్రయల్ షూట్ ను వాయిదా వేశారు.
మరోవైపు హైదరాబాద్ లో విస్తారంగా వానలు కురుస్తున్నాయి. మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఆర్ఆర్ఆర్ ట్రయల్ షూట్ ను వాయిదా వేశాడు రాజమౌళి.