నాకు నచ్చిన వ్యక్తికి ఓటేశా " రాపాక
రాజ్యసభ ఎన్నికల్లో జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తనకు నచ్చిన వారికి ఓటేశానని వెల్లడించారు. జనసేన తనకు ఎలాంటి విప్ జారీ చేయలేదన్నారు. ఇతర పార్టీలు కూడా సంప్రదించలేదని… ఓటు హక్కు ఉంది కాబట్టి వచ్చి వినియోగించుకున్నానని చెప్పారు. తనకు నచ్చిన వ్యక్తికే ఓటేశానని చెప్పారు. టీడీపీ వర్లరామయ్యను నామమాత్రంగా పోటీలో దింపిందన్నారు. టీడీపీ పోటీ పెట్టాల్సిన అవసరం లేదన్నారు. జనసేనతో తనకు గ్యాప్ ఏమీ లేదన్నారు. పార్టీ కార్యక్రమాలు లేవని…అందుకే […]
రాజ్యసభ ఎన్నికల్లో జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తనకు నచ్చిన వారికి ఓటేశానని వెల్లడించారు. జనసేన తనకు ఎలాంటి విప్ జారీ చేయలేదన్నారు. ఇతర పార్టీలు కూడా సంప్రదించలేదని… ఓటు హక్కు ఉంది కాబట్టి వచ్చి వినియోగించుకున్నానని చెప్పారు.
తనకు నచ్చిన వ్యక్తికే ఓటేశానని చెప్పారు. టీడీపీ వర్లరామయ్యను నామమాత్రంగా పోటీలో దింపిందన్నారు. టీడీపీ పోటీ పెట్టాల్సిన అవసరం లేదన్నారు.
జనసేనతో తనకు గ్యాప్ ఏమీ లేదన్నారు. పార్టీ కార్యక్రమాలు లేవని…అందుకే తాను పాల్గొనే పరిస్థితి కూడా లేదన్నారు. తాను గెలిచి ఏడాది అవుతున్నా పార్టీ నాయకత్వం తనను పట్టించుకున్న సందర్బం లేదన్నారు. ఏనాడైనా పవన్ కల్యాణ్ తనను పక్కన కూర్చోబెట్టుకున్నారా అని ప్రశ్నించారు. అయినా తానేమీ బాధపడడం లేదని… తాను జనసేన గుర్తు మీద గెలిచింది నిజమని రాపాక చెప్పారు.
దళితుడిగా, పేదవాడిగా ఇబ్బందులు తెలుసు కాబట్టే తాను ఇంగ్లీష్ మీడియంకు మద్దతు ఇచ్చానన్నారు. ప్రభుత్వం మంచి పని చేసినప్పుడు మద్దతు ఇచ్చానని… ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా ఉంటే నిధులు మంజూరు కూడా ఈజీగా ఉంటుందని.. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడానికి వీలుంటుందన్నారు.