Telugu Global
National

రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం

నాలుగు సీట్లూ అధికార పార్టీవే టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యకు 17 ఓట్లు ఏపీ కోటాలో ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు జరిగిన ఎన్నికల్లో 173 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి వైసీపీ అభ్యర్థులు గెలిచినట్లు ప్రకటించారు. టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యకు […]

రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం
X
  • నాలుగు సీట్లూ అధికార పార్టీవే
  • టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యకు 17 ఓట్లు

ఏపీ కోటాలో ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్థానాలకు శుక్రవారం జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఇవాళ ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు జరిగిన ఎన్నికల్లో 173 మంది ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టి వైసీపీ అభ్యర్థులు గెలిచినట్లు ప్రకటించారు. టీడీపీ అభ్యర్థి వర్ల రామయ్యకు కేవలం 17 ఓట్లు మాత్రమే లభించాయి.

వైసీపీ తరపున బరిలో నిలిచిన అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. టీడీపీ ఎమ్మెల్యేలు వేసిన ఓట్లలో నాలుగు ఓట్లు చెల్లకుండా పోయినట్లు తెలిసింది. ఆదిరెడ్డి భవానీ ఓటింగ్ కాగితంలోని ప్రాధాన్యత క్రమంలో 1 అనే సంఖ్య వేసే బదులు టిక్ మార్క్ పెట్టడంతో చెల్లలేదు. అవగాహనా లోపంతోనే ఈ పొరపాటు జరిగినట్లు ఆమె తెలిపారు.

ఇక టీడీపీ నుంచి సస్పెండ్ అయిన వల్లభనేని వంశీ ఓటు కూడా చెల్లనట్లు తెలుస్తోంది. ఆయన కూడా ప్రాధాన్యత సంఖ్య వేయకుండా టిక్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే సాంకేతికంగా తనపై వేటు పడకూడదనే ఇలా వోటు వేసి ఉంటారని భావిస్తున్నారు.

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన దగ్గరి నుంచి వైసీపీకే ఆ నాలుగు సీట్లు దక్కుతాయనే విషయం తెలిసిందే. అయితే కావాలనే టీడీపీ అధినేత చంద్రబాబు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వర్ల రామయ్యను ఎన్నికల బరిలో నిలిపారనే విమర్శలు ఉన్నాయి. ఆయన గెలవరని తెలిసి రామయ్యను బరిలోకి దింపడం వల్లే రాజ్యసభకు ఎన్నికలు అనివార్యం అయ్యాయి. చివరి వరకు రామయ్య వైపు ఎమ్మెల్యేలు మళ్లేలా ఎత్తులు వేసినా చివరకు వైసీపీ అభ్యర్థుల గెలుపు నల్లేరు మీద నడకలా సాగింది.

First Published:  19 Jun 2020 4:08 PM IST
Next Story