ఓటేసిన జగన్
దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. 10 రాష్ట్రాల్లో మొత్తం 19 రాజ్యసభ స్థానాలతో పాటు గతంలో వాయిదా పడ్డ ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో నాలుగు సీట్లకు… మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో మూడు సీట్లకు… జార్ఖండ్ నుంచి రెండు సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయా, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో ఒక్కొక్క సీటుకు ఎన్నిక జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు స్థానాలకు ఉదయం పోలింగ్ మొదలైంది. ముఖ్యమంత్రి […]
దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. 10 రాష్ట్రాల్లో మొత్తం 19 రాజ్యసభ స్థానాలతో పాటు గతంలో వాయిదా పడ్డ ఆరు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో నాలుగు సీట్లకు… మధ్యప్రదేశ్, రాజస్తాన్ రాష్ట్రాల్లో మూడు సీట్లకు… జార్ఖండ్ నుంచి రెండు సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయా, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాల్లో ఒక్కొక్క సీటుకు ఎన్నిక జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు స్థానాలకు ఉదయం పోలింగ్ మొదలైంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి, స్పీకర్ తమ్మినేనితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జగన్‌మోహన్ రెడ్డి ఓటును పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు వైసీపీ కేటాయించింది. వైఎస్సార్‌సీపీ తరఫున రాజ్యసభకు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ పోటీలో ఉన్నారు. టీడీపీ నుంచి వర్ల రామయ్య బరిలో ఉన్నారు. ప్రస్తుత బలం ప్రకారం నాలుగు స్థానాల్లోనూ వైసీపీ విజయం లాంచనమే.