Telugu Global
NEWS

చంద్రబాబుకు షాక్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు...

రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి పలువురు ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. టీడీపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటేయలేదు. గుంటూరు జిల్లా రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా ఓటింగ్‌కు రాలేదు. అయితే తాను ఎందుకు ఓటేసేందుకు రావడం లేదన్న దానిపై సత్యప్రసాద్ చంద్రబాబుకు లేఖ రాశారని ఆ పార్టీ అనుబంధ మీడియా చెబుతోంది. ఇటీవల కరోనా బారినపడ్డ తెలంగాణ ఎమ్మెల్యే యాదగిరి రెడ్డిని తాను ఒక సందర్భంలో కలిశానని… అందుకే ఇప్పుడు సెల్ప్ క్వారంటైన్‌లో ఉన్నానని, […]

చంద్రబాబుకు షాక్ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యేలు...
X

రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీకి పలువురు ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. టీడీపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి ఓటేయలేదు. గుంటూరు జిల్లా రేపల్లె టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా ఓటింగ్‌కు రాలేదు. అయితే తాను ఎందుకు ఓటేసేందుకు రావడం లేదన్న దానిపై సత్యప్రసాద్ చంద్రబాబుకు లేఖ రాశారని ఆ పార్టీ అనుబంధ మీడియా చెబుతోంది.

ఇటీవల కరోనా బారినపడ్డ తెలంగాణ ఎమ్మెల్యే యాదగిరి రెడ్డిని తాను ఒక సందర్భంలో కలిశానని… అందుకే ఇప్పుడు సెల్ప్ క్వారంటైన్‌లో ఉన్నానని, ఓటేసేందుకు రాలేకపోతున్నానని చంద్రబాబుకు సత్యప్రసాద్ లేఖ రాశారని టీడీపీ చెబుతోంది.

అచ్చెన్నాయుడు ఆస్పత్రికే పరిమితమయ్యారు. ముగ్గురు రెబల్ఎమ్మెల్యేలు వంశీ, మద్దాలి గిరి, బలరాం ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ తర్వాత మద్దాలి గిరి, వల్లభనేని వంశీ మీడియా ముందుకు వచ్చారు. తెలుగుదేశం పార్టీని దయనీయ స్థితికి చంద్రబాబు తెచ్చారని మద్దాలి గిరి ఫైర్ అయ్యారు.

బలం లేదని తెలిసినా దళితుడైన వర్ల రామయ్యను బరిలో దింపి దళితులను చంద్రబాబు అవమానించారని మద్దాలి గిరి విమర్శించారు. తాము విప్‌ ప్రకారమే ఓటేశామంటూ మద్దాలి గిరి నవ్వుతూ వెళ్లిపోయారు. చివరకు పోలింగ్‌లో ఏజెంట్‌గా ఎమ్మెల్యేను పెట్టుకోలేని స్థితికి చంద్రబాబు వచ్చారని… మాజీ ఉద్యోగులను ఏజెంట్లుగా పెట్టుకోవాల్సిన దుస్థితి వచ్చిందని వల్లభనేని వంశీ విమర్శించారు.

పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఇప్పుడు ఓటేయాల్సిందిగా తనను అడిగేందుకు చంద్రబాబుకు సిగ్గుండాలని వల్లభనేని వంశీ వ్యాఖ్యానించారు. తనకు విప్‌ ఇవ్వడానికి చంద్రబాబుకు సిగ్గు ఉండాలన్నారు. అసలు రాజ్యసభ ఎన్నికలకు విప్ వర్తించదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయకత్వంలో మునిగిన టీడీపీని ధర్మాడి సత్యం కూడా బయటకు తీయలేరన్నారు వంశీ.

First Published:  19 Jun 2020 6:00 AM GMT
Next Story