Telugu Global
National

తెలంగాణలో పెరుగుతున్న మరణాల రేటు

కోవిడ్-19 మరణాల రేటులో తెలంగాణ రాష్ట్రం ఒక్కసారిగా నాలుగో స్థానానికి చేరుకుంది. గుజరాత్, పశ్చిమ బంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల తర్వాత మరణాల రేటులో తెలంగాణ నిలిచింది. మరోవైపు కరోనా పాజిటివ్ కేసుల నమోదులో కూడా తెలంగాణ ఇతర రాష్ట్రాలను మించిపోతోంది. లాక్‌డౌన్ నిబంధనలు ఎత్తేసిన తర్వాత రాష్ట్రంలో కొవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. కేవలం పాజిటివ్ కేసుల నమోదులోనే కాకుండా మరణాలు కూడా భారీగా సంభవిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో మరణాల రేటు 3.84 శాతంగా ఉంది. […]

తెలంగాణలో పెరుగుతున్న మరణాల రేటు
X

కోవిడ్-19 మరణాల రేటులో తెలంగాణ రాష్ట్రం ఒక్కసారిగా నాలుగో స్థానానికి చేరుకుంది. గుజరాత్, పశ్చిమ బంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల తర్వాత మరణాల రేటులో తెలంగాణ నిలిచింది. మరోవైపు కరోనా పాజిటివ్ కేసుల నమోదులో కూడా తెలంగాణ ఇతర రాష్ట్రాలను మించిపోతోంది.

లాక్‌డౌన్ నిబంధనలు ఎత్తేసిన తర్వాత రాష్ట్రంలో కొవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. కేవలం పాజిటివ్ కేసుల నమోదులోనే కాకుండా మరణాలు కూడా భారీగా సంభవిస్తున్నాయి.

ప్రస్తుతం తెలంగాణలో మరణాల రేటు 3.84 శాతంగా ఉంది. ఇది దేశంలోని మరణాల రేటు 2.87 కంటే ఎక్కువ కావడం గమనార్హం.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం మరణాల సరాసరి గుజరాత్‌లో 6.28 శాతం, పశ్చిమ బెంగాల్‌లో 4.33 శాతం, మధ్యప్రదేశ్‌లో 4.20 శాతం ఉండగా.. ఆ తర్వాత స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉండటం గమనార్హం.

ఈ విషయంపై ఆరోగ్య శాఖకు చెందిన ఒక ఉన్నతాధికారి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా లక్షణాలు ఉన్న వారికే టెస్టులు నిర్వహిస్తున్నాం. వాళ్లనే ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నాం. అందుకే మరణాల రేటు కూడా ఎక్కువగా ఉందని చెప్పారు.

ఇక కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మరణాల రేటుపై స్పందించింది. ఢిల్లీ, మహారాష్ట్రలో అత్యధికంగా కోవిడ్-19 కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కానీ అక్కడి మరణాల రేటు మాత్రం తెలంగాణ కంటే తక్కువగానే ఉన్నట్లు స్పష్టం చేసింది.

కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో అత్యధిక మరణాలు సంభవిస్తోంది తెలంణలోనే అని పలు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇక తెలంగాణ పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 1.43 శాతంతో అత్యంత తక్కువ మరణాల రేటు ఉండటం గమనార్హం.

ఇక టెస్టుల విషయంలో కూడా తెలంగాణ వెనుకబడే ఉంది. హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన తర్వాత కాస్త టెస్టుల సంఖ్య పెంచడంతో గత రెండు వారాలుగా తెలంగాణలో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వంపై విమర్శలు ఎక్కువవడంతో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్-రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల పరిధిలోని 30 అసెంబ్లీ సెగ్మెంట్లలో 50 వేల టెస్టులు చేయబోతున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇతర రాష్ట్రాల కంటే కరోనాను సమర్థవంతంగా ఎదుర్కుంటున్నట్లు చెప్పారు.

అయితే గుజరాత్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో కరోనా టెస్టులు తక్కువగానే నిర్వహిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో 3.24 లక్షల టెస్టులు చేయగా.. తెలంగాణలో అసలు ఎన్ని టెస్టులు నిర్వహించారో కూడా లెక్కలేదు. టెస్టుల సంఖ్య, ప్రతీ 10 లక్షల మందిలో ఎంత మందికి టెస్టులు నిర్వహించారనే గణాంకాలను కేంద్రానికి కూడా పంపించలేదు.

మరోవైపు తెలంగాణలో కోవిడ్-19 రికవరీ రేటు కూడా తక్కువగానే ఉంది. తెలంగాణలో 49.65 శాతం రికవరీ రేటు ఉండగా.. తెలంగాణ కంటే ముందు 13 రాష్ట్రాలు ఉన్నాయి. పంజాబ్, రాజస్థాన్‌లో 75 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 60 శాతం ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో 53.90 శాతం రికవరీ రేటు ఉంది.

First Published:  18 Jun 2020 12:03 PM IST
Next Story