Telugu Global
Cinema & Entertainment

బాలీవుడ్ పెద్దలపై రవీనా టాండన్ ఫైర్

సుశాంత్ ఆత్మహత్యలో బాలీవుడ్ లో కొందరు ప్రముఖులు, పెద్ద కుటుంబాలు చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. మొన్నటివరకు బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ మాత్రమే పెద్ద వ్యవహారం. కానీ సుశాంత్ ఆత్మహత్య తర్వాత అంతకంటే పెద్ద వ్యవహారాలు బయటకొస్తున్నాయి. కేవలం కొందరు పెద్ద మనుషులు, మరికొన్ని పెద్ద కుటుంబాలకు మాత్రమే బాలీవుడ్ పరిమితం అంటూ నటీనటులు కొందరు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. వీటికి మరింత బలం చేకూరుస్తూ ఒకప్పటి టాప్ హీరోయిన్ రవీనా టాండన్ కూడా రియాక్ట్ […]

బాలీవుడ్ పెద్దలపై రవీనా టాండన్ ఫైర్
X

సుశాంత్ ఆత్మహత్యలో బాలీవుడ్ లో కొందరు ప్రముఖులు, పెద్ద కుటుంబాలు చేసిన అకృత్యాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. మొన్నటివరకు బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ మాత్రమే పెద్ద వ్యవహారం. కానీ సుశాంత్ ఆత్మహత్య తర్వాత అంతకంటే పెద్ద వ్యవహారాలు బయటకొస్తున్నాయి.

కేవలం కొందరు పెద్ద మనుషులు, మరికొన్ని పెద్ద కుటుంబాలకు మాత్రమే బాలీవుడ్ పరిమితం అంటూ నటీనటులు కొందరు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. వీటికి మరింత బలం చేకూరుస్తూ ఒకప్పటి టాప్ హీరోయిన్ రవీనా టాండన్ కూడా రియాక్ట్ అవ్వడం విశేషం.

అవును.. రవీన్ టాండన్ కు కూడా కెరీర్ ప్రారంభంలో ఆటంకాలు, అవమానాలు తప్పలేదు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా బయటపెట్టారు. పరిశ్రమలో కుళ్లు రాజకీయాలు, గ్రూపులు ఎక్కువయ్యాయని.. కొందరు హీరోలు, వాళ్ల గర్ల్ ఫ్రెండ్స్ తనను పలు సినిమాల నుంచి తప్పించారంటూ సంచలన ఆరోపణలు చేసింది రవీనా.

అలా కొన్ని పెద్ద సినిమాల్లో తను అవకాశాలు కోల్పోయానని చెప్పుకొచ్చింది. అయితే అలాంటి ప్రయత్నాలేవీ తనను అడ్డుకోలేకపోయానని చెప్పుకొచ్చింది రవీనా. తనను అణచివేయాలని ఎంత ప్రయత్నించారో, అంతే గట్టిగా తను నిలబడినట్టు చెప్పుకొచ్చింది. ఇలాంటివన్నీ ఎదుర్కొని, దాటుకొని వచ్చినప్పుడు మాత్రమే బాలీవుడ్ లో గుర్తింపు ఉంటుందని చెప్పుకొచ్చింది రవీనా. ఎట్టి పరిస్థితుల్లో ధైర్యం కోల్పోకూడదని, విజయానికి అదే తొలి మెట్టు అని చెబుతోంది.

First Published:  18 Jun 2020 1:32 AM IST
Next Story