జేసీకి చుక్కెదురు
బీఎస్3 వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్ట్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలకు కోర్టు బెయిల్ నిరాకరించింది. వారిని రెండు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. నిందితులు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా అనంతపురం కోర్టు తిరస్కరించింది. పోలీసుల విజ్ఞప్తి మేరకు వారిని రెండు రోజుల కస్టడీకి అప్పగించింది. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి లని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించనున్నారు. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 […]

బీఎస్3 వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్ట్ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలకు కోర్టు బెయిల్ నిరాకరించింది. వారిని రెండు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది.
నిందితులు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా అనంతపురం కోర్టు తిరస్కరించింది. పోలీసుల విజ్ఞప్తి మేరకు వారిని రెండు రోజుల కస్టడీకి అప్పగించింది. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి లని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించనున్నారు.
బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా ఎలా రిజిస్ట్రేషన్ చేయంచారు?, నకిలీ పత్రాలు ఎలా సృష్టించారు? నకిలీ ఇన్సూరెన్స్‌లను ఎవరి సాయంతో సృష్టించారు ? పోలీసుల సంతకాలను ఫోర్జరీ ఎలా చేశారు? వంటి అంశాలపై విచారించనున్నారు.
మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలపై మరో ఐదు కేసుల్లో అనంతపురం పోలీసులు పీటీ వారెంట్ ఇచ్చారు.