Telugu Global
National

మూడు రాజధానుల బిల్లును ఇక ఆపలేరు...

ద్రవ్య వినిమయ బిల్లు, మూడు రాజధానుల బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లును చర్చకు తీసుకోకుండానే, ఆమోదించకుండానే శానసమండలి నిరవధికంగా వాయిదా పడింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆధిక్యం ఉండడంతో సభ చంద్రబాబు కనుసన్నల్లోనే నడిచింది. ద్రవ్యవినిమయ బిల్లును కూడా ఆమోదించకుండా సభను వాయిదా వేయడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే నిపుణులు చెబుతున్న దాని ప్రకారం… ఈ మూడు బిల్లులనూ మండలి ఎక్కువ కాలం అడ్డుకునే అవకాశం లేదు. ఆర్థిక బిల్లు ఏదైనా సరే శాసనమండలి 14 రోజుల్లో […]

మూడు రాజధానుల బిల్లును ఇక ఆపలేరు...
X

ద్రవ్య వినిమయ బిల్లు, మూడు రాజధానుల బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లును చర్చకు తీసుకోకుండానే, ఆమోదించకుండానే శానసమండలి నిరవధికంగా వాయిదా పడింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆధిక్యం ఉండడంతో సభ చంద్రబాబు కనుసన్నల్లోనే నడిచింది. ద్రవ్యవినిమయ బిల్లును కూడా ఆమోదించకుండా సభను వాయిదా వేయడంపై విమర్శలు వస్తున్నాయి. అయితే నిపుణులు చెబుతున్న దాని ప్రకారం… ఈ మూడు బిల్లులనూ మండలి ఎక్కువ కాలం అడ్డుకునే అవకాశం లేదు.

ఆర్థిక బిల్లు ఏదైనా సరే శాసనమండలి 14 రోజుల్లో అమోదించాలి. ఒకవేళ మండలి ఆమోదించకపోయినా, తిరస్కరించినా… అది ఆమోదం పొందినట్టుగానే భావిస్తారు. కాబట్టి ద్రవ్య వినిమయ బిల్లును కేవలం 14 రోజులు మాత్రమే మండలి అడ్డుకోగలదు.
అంతకు మించి సాధించేది ఏమీ లేదు.

మూడు రాజధానుల బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులను కూడా ఇక శాసనమండలి అడ్డుకునే అవకాశం లేదు. ఇది వరకే ఈ రెండు బిల్లులను మండలికి పంపించారు. మూడు నెలల్లోగా అక్కడి నుంచి స్పందన రావాలి. కానీ అలా జరగలేదు. ఇప్పుడు అసెంబ్లీ రెండోసారి అవే బిల్లులను ఆమోదించి శాసనమండలికి పంపింది. ఇలా రెండోసారి బిల్లులను పంపితే శాసనమండలి నెల రోజుల్లో నిర్ణయం తీసుకోవాలి. రెండోసారి పంపిన బిల్లులను నెల రోజుల్లో ఆమోదించాలి…. లేదా తిరస్కరించవచ్చు.

రెండోసారి పంపిన బిల్లులను ఆమోదించినా, తిరస్కరించినా దాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. మండలి రెండోసారి కూడా ఈ బిల్లులను తిరస్కరిస్తే అప్పుడు అంతిమ నిర్ణయం శాసనసభదే అవుతుంది.

ఏపీ మండలిలో పరిణామాలపై మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి స్పందించారు. కొన్ని కీలక అంశాలను ఆయన ప్రస్తావించారు. ”ద్రవ్యవినిమయ బిల్లు మనీ బిల్లు కనుక శాసనసభకే సర్వాధికారాలుంటాయని ఆయన చెప్పారు. బడ్జెట్‌పై చర్చించి వారికేమైనా సలహాలుంటే ఇచ్చి ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించాల్సిందే. పరిస్థితులు ఎలా ఉన్నా సద్దుమణిగేలా చేస్తూ ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించే వరకు సభను కొనసాగించకుండా ఎందుకు వాయిదా వేశారో అర్థం కాకుండా ఉంది. ద్రవ్యవినిమయ బిల్లు పూర్తిగా అసెంబ్లీ అధికార పరిధికి లోబడి ఉంటుంది. మూడు రాజధానులకు సంబంధించి మొదట పంపించిన బిల్లుపై శాసనమండలి గడువులోగా ఏ నిర్ణయమూ తీసుకోలేదు కనుక రెండోసారి అదే బిల్లును మళ్లీ శాసనసభ ఆమోదించి మండలికి పంపించింది.

మండలి కేవలం సలహాలు ఇవ్వడం వరకే పరిమితం తప్ప బిల్లులను అడ్డుకొనే అధికారం లేదు. పెద్దల సభ ఏ ఉద్దేశంతో ఏర్పడిందో దానికి విరుద్ధంగా ఏపీలో కార్యకలాపాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న శాసనసభకే సర్వాధికారాలుంటాయి.

మూడు రాజధానుల బిల్లును రెండుసార్లు అసెంబ్లీలో ఆమోదించి పంపించారు. రెండోసారి పంపించిన తరువాత శాసనమండలిలో ప్రవేశపెట్టినా, ప్రవేశపెట్టకున్నా, చర్చించినా చర్చించకున్నా, ఆమోదించినా ఆమోదించకున్నా శాసనసభ దాన్ని పట్టించుకోవలసిన అవసరం లేదు. శాసనసభకు పూర్తి అధికారాలున్నందున రెండోసారి బిల్లు పంపినందున అది ఆమోదమైనట్లే భావించి నిర్ణయం తీసుకోవచ్చు” అని సురేష్‌ రెడ్డి స్పష్టం చేశారు.

First Published:  18 Jun 2020 6:54 AM IST
Next Story