Telugu Global
NEWS

మహిళా కమిషనర్‌ బట్టలు ఊడదీస్తామన్న అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు

టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు నమోదైంది. మహిళా కమిషనర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేశారు. విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్‌ తోట కృష్ణవేణిని అందరి ముందు అసభ్యకరంగా దూషించినందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై నిర్భయ చట్టం కింద ఐపీసీ సెక్షన్‌ 354–ఎ(4), 500, 504, 5050(1)(బి), 505(2), 506, 509 ప్రకారం కేసు నమోదు చేసినట్లు సీఐ స్వామినాయుడు […]

మహిళా కమిషనర్‌ బట్టలు ఊడదీస్తామన్న అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు
X

టీడీపీ మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు నమోదైంది. మహిళా కమిషనర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో పోలీసులు కేసు నమోదు చేశారు.

విశాఖ జిల్లా నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్‌ తోట కృష్ణవేణిని అందరి ముందు అసభ్యకరంగా దూషించినందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. కమిషనర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆయనపై నిర్భయ చట్టం కింద ఐపీసీ సెక్షన్‌ 354–ఎ(4), 500, 504, 5050(1)(బి), 505(2), 506, 509 ప్రకారం కేసు నమోదు చేసినట్లు సీఐ స్వామినాయుడు వెల్లడించారు.

మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయాన్ని ఇటీవల ఆధునీకరిస్తుండడంతో హాల్‌లో ఉన్న అయ్యన్నపాత్రుడి తాత లత్సాపాత్రుడి ఫొటోను అధికారులు వేరే చోటికి మార్చారు. దాంతో ఆగ్రహించిన చింతకాయల తన తాత ఫొటో ప్రభుత్వ కార్యాలయంలో యథాస్థానంలో ఉంచాలని డిమాండ్ చేశారు. హాల్‌కు రంగులు వేస్తున్నామని నెల రోజుల్లో చిత్రపటాన్ని యథాస్ధానంలో ఉంచుతామని కమిషనర్‌ వివరణ ఇచ్చినా అయ్యన్నపాత్రుడు నోటి దురుసుతో ఫొటో తొలగించే అధికారం కమిషనర్‌కు ఎవడిచ్చాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనుచరులతో పాటు ఆందోళనకు దిగారు.

మైక్ తీసుకుని మరీ మాట్లాడుతూ…. నెల రోజుల్లో తన తాత ఫొటో యథాస్థానంలో పెట్టకపోతే మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి బట్టలు ఊడదీసే పరిస్థితి వస్తుందని అనుచిత వ్యాఖ్యలు చేశారు. కమిషనర్ ఆడ ఆఫీసర్ అయిపోయిందని… అదే మగాడై ఉంటే ఇప్పటికే ట్రీట్‌మెంట్‌ మరోలా ఉండేదని వార్నింగ్ ఇచ్చారు.

కమిషనర్ బట్టలు ఊడదీసే పరిస్థితి వస్తుందని బహిరంగంగా అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన కృష్ణవేణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో చింతకాయలపై నిర్భయ కేసు పెట్టారు.

First Published:  17 Jun 2020 1:57 AM IST
Next Story