Telugu Global
Cinema & Entertainment

మహేష్ కెరీర్ లో రెండో భారీ గ్యాప్ ఇదే

అప్పుడెప్పుడో అతిథి సినిమా టైమ్ లో ఏడాది గ్యాప్ తీసుకున్నాడు మహేష్. ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో, నెక్ట్స్ సినిమాకు ఎలాంటి కథను సెలక్ట్ చేసుకోవాలో తెలియక గ్యాప్ తీసుకున్నాడు. మహేష్ కెరీర్ లో అదే పెద్ద గ్యాప్. మళ్లీ ఇన్నాళ్లకు ఈ హీరో కెరీర్ లో మరో భారీ గ్యాప్ వచ్చింది. అతిథి సినిమా ఫ్లాప్ కాబట్టి గ్యాప్ వచ్చిందని అనుకోవచ్చు. కానీ సరిలేరు నీకెవ్వరు సినిమా హిట్టయినా మహేష్ కు గ్యాప్ తప్పలేదు. అయితే […]

మహేష్ కెరీర్ లో రెండో భారీ గ్యాప్ ఇదే
X

అప్పుడెప్పుడో అతిథి సినిమా టైమ్ లో ఏడాది గ్యాప్ తీసుకున్నాడు మహేష్. ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడంతో, నెక్ట్స్ సినిమాకు ఎలాంటి కథను సెలక్ట్ చేసుకోవాలో తెలియక గ్యాప్ తీసుకున్నాడు. మహేష్ కెరీర్ లో అదే పెద్ద గ్యాప్. మళ్లీ ఇన్నాళ్లకు ఈ హీరో కెరీర్ లో మరో భారీ గ్యాప్ వచ్చింది.

అతిథి సినిమా ఫ్లాప్ కాబట్టి గ్యాప్ వచ్చిందని అనుకోవచ్చు. కానీ సరిలేరు నీకెవ్వరు సినిమా హిట్టయినా మహేష్ కు గ్యాప్ తప్పలేదు. అయితే ఈసారి మహేష్ తప్పు కాదు, కరోనా వల్ల కెరీర్ లో గ్యాప్ వచ్చేసింది.

సరిలేరు నీకెవ్వరు సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత 3 నెలలు గ్యాప్ తీసుకుంటానని ప్రకటించాడు మహేష్. చెప్పినట్టుగానే గ్యాప్ తీసుకున్నాడు. అయితే ఆ గ్యాప్ లో నెక్ట్స్ సినిమాను ప్రకటించడంలో ఫెయిల్ అయ్యాడు. దీంతో మరికొన్నాళ్లు గ్యాప్ తప్పలేదు. మొత్తానికి ఎలాగోలా పరశురామ్ దర్శకత్వంలో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అయినప్పటికీ లాక్ డౌన్ వల్ల వెంటనే సెట్స్ పైకి వెళ్లలేని పరిస్థితి. ఇప్పుడు షూటింగ్స్ కు అనుమతి ఇచ్చినా సెట్స్ పైకి వెళ్లడానికి పరిస్థితులు అనుకూలంగా లేవు. దీంతో మళ్లీ మహేష్ కు గ్యాప్ తప్పలేదు. అలా ఈ ఏడాది సంక్రాంతి నుంచి గ్యాప్ లోనే ఉన్నాడు మహేష్.

First Published:  17 Jun 2020 6:30 AM IST
Next Story