Telugu Global
NEWS

డిమాండ్‌ చేసి మౌనంగా ఉండిపోయిన టీడీపీ

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ నిర్వహించిన బీఏసీ సమావేశంలో టీడీపీ ఒక డిమాండ్‌ పెట్టింది. ఆ తర్వాత మౌనంగా ఉండిపోయింది. టీడీపీ తరపున ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బీఏసీ సమావేశానికి హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులకే కుదించే చర్య సరైనది కాదని టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. వర్చువల్‌గా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రామానాయుడు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు నిర్వహించేందుకు తాము సిద్ధమని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. కాకపోతే పార్లమెంట్ ఇంకా […]

డిమాండ్‌ చేసి మౌనంగా ఉండిపోయిన టీడీపీ
X

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ నిర్వహించిన బీఏసీ సమావేశంలో టీడీపీ ఒక డిమాండ్‌ పెట్టింది. ఆ తర్వాత మౌనంగా ఉండిపోయింది. టీడీపీ తరపున ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు బీఏసీ సమావేశానికి హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులకే కుదించే చర్య సరైనది కాదని టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. వర్చువల్‌గా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రామానాయుడు డిమాండ్ చేశారు.

అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు నిర్వహించేందుకు తాము సిద్ధమని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. కాకపోతే పార్లమెంట్ ఇంకా నిర్ణయం తీసుకోనందున వర్చువల్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. టీడీపీ డిమాండ్ చేస్తే ఇప్పుడున్న తరహాలోనే 50రోజులైనా అసెంబ్లీ నిర్వహించేందుకు తాము సిద్ధమన్నారు. బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసని… అయినా సరే ఎక్కువ రోజులు అసెంబ్లీ సమావేశాలు కావాలని టీడీపీ కోరితే తమకు అభ్యంతరం లేదన్నారు.

తాము ప్రజల కోసం చాలా కార్యక్రమాలు చేశామని… వాటిని అసెంబ్లీ వేదికగా వివరించాలని తమకూ ఉందని… కాబట్టి అసెంబ్లీని ఎన్ని రోజులు నడపాలో టీడీపీ తరపున అడగండి… నిర్వహిస్తాం అంటూ జగన్‌మోహన్ రెడ్డి ఆఫర్ చేశారు. 50 రోజులైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు తాము సిద్దమని… దీనిపై తెలుగుదేశం పార్టీ తరపున నిర్ణయాన్ని చెప్పండి అని జగన్‌మోహన్ రెడ్డి నేరుగా చెప్పడంతో ఎమ్మెల్యే రామానాయుడు మౌనంగా ఉండిపోయారు.

First Published:  17 Jun 2020 12:40 AM IST
Next Story