Telugu Global
Cinema & Entertainment

రంగస్థలం బాటలో పుష్ప

రంగస్థలం సినిమాను నేచురల్ లొకేషన్స్ లో తీయాలనుకున్నాడు సుకుమార్. కొన్ని రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లా గోదారి ఒడ్డున షూటింగ్ కూడా చేశాడు. కానీ ఎండ ధాటికి సమంతకు వడదెబ్బ తగిలింది. యూనిట్ లో చాలామంది ఇబ్బందిపడ్డారు. దీంతో ఏకంగా ఓ విలేజ్ సెట్ ను నిర్మించారు. స్టుడియోలో షూటింగ్ చేశారు. ఇప్పుడు పుష్ప సినిమాకు సంబంధించి కూడా దాదాపు ఇలాంటి సమస్యే ఎదురైంది సుకుమార్ కి. పుష్ప సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను జనవరిలోనే పూర్తిచేశారు. […]

రంగస్థలం బాటలో పుష్ప
X

రంగస్థలం సినిమాను నేచురల్ లొకేషన్స్ లో తీయాలనుకున్నాడు సుకుమార్. కొన్ని రోజుల పాటు తూర్పుగోదావరి జిల్లా గోదారి ఒడ్డున షూటింగ్ కూడా చేశాడు. కానీ ఎండ ధాటికి సమంతకు వడదెబ్బ తగిలింది. యూనిట్ లో చాలామంది ఇబ్బందిపడ్డారు. దీంతో ఏకంగా ఓ విలేజ్ సెట్ ను నిర్మించారు. స్టుడియోలో షూటింగ్ చేశారు. ఇప్పుడు పుష్ప సినిమాకు సంబంధించి కూడా దాదాపు ఇలాంటి సమస్యే ఎదురైంది సుకుమార్ కి.

పుష్ప సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను జనవరిలోనే పూర్తిచేశారు. కేరళలోని అటవీ ప్రాంతంలో షూట్ జరిగింది. రెండో షెడ్యూల్ ను కూడా కేరళలోనే కొనసాగించాలనుకున్నారు. కానీ కరోనా కేసులు రావడంతో కేరళ నుంచి ఈస్ట్ గోదావరి జిల్లా మారేడుమిల్లి ప్రాంతానికి లొకేషన్ ను మార్చారు.

అయినప్పటికీ సుకుమార్ అనుకున్నది జరగలేదు. లాక్ డౌన్ పడింది. ఇప్పుడు లాక్ డౌన్ తర్వాత, షూటింగ్స్ కు అనుమతి వచ్చినప్పటికీ అటు వెళ్లి షూట్ చేయలేని పరిస్థితి. దీంతో ఇప్పుడు రంగస్థలం తరహాలోనే పుష్ప కోసం కూడా సెట్ వేయాలని నిర్ణయించారు. అన్నపూర్ణ స్టుడియోస్ లో భారీ అడవి సెట్ నిర్మించబోతున్నారు. అది రెడీ అయిన తర్వాత బన్నీ, రష్మిక జాయిన్ అవుతారు.

First Published:  16 Jun 2020 3:55 PM IST
Next Story