Telugu Global
NEWS

రఘరామ కృష్ణం రాజు తేడా మనిషి... పెద్ద సీరియస్‌గా తీసుకోమాకండి...

వైసీపీ నాయకులు బతిమలాడితేనే తాను ఆ పార్టీలో చేరి నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేశానని… తన వల్లే అక్కడ చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచారన్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్పందించారు. రఘురామ కృష్ణంరాజు తన వ్యక్తిగత ఎజెండాను పక్కన పెట్టాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సలహా ఇచ్చారు. వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాత్రం రఘరామకృష్ణంరాజు వ్యవహారాన్ని చాలా లైట్ తీసుకున్నారు. ఈ అంశంపై విలేకర్లు […]

రఘరామ కృష్ణం రాజు తేడా మనిషి... పెద్ద సీరియస్‌గా తీసుకోమాకండి...
X

వైసీపీ నాయకులు బతిమలాడితేనే తాను ఆ పార్టీలో చేరి నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేశానని… తన వల్లే అక్కడ చాలా మంది ఎమ్మెల్యేలు గెలిచారన్న ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్పందించారు.

రఘురామ కృష్ణంరాజు తన వ్యక్తిగత ఎజెండాను పక్కన పెట్టాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సలహా ఇచ్చారు. వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాత్రం రఘరామకృష్ణంరాజు వ్యవహారాన్ని చాలా లైట్ తీసుకున్నారు. ఈ అంశంపై విలేకర్లు ప్రశ్నించగా స్పందించిన అంబటి రాంబాబు… ” మా పార్టీ ఎంపీ కామెంట్ చేశారా?. రఘురామకృష్ణంరాజు కామెంట్ చేశాడా?. ఎప్పుడు ?. ఆయన ఎప్పుడూ అలాగే చేస్తుంటాడు. పెద్దగా సీరియస్‌గా తీసుకోవద్దు. ఆయన తేడా మనిషి ” అని వ్యాఖ్యానించారు.

మంత్రి అనిల్ కుమార్ స్పందన ఇది..

”జగన్‌ ఒక చరిత్ర సృష్టించారు. 151 సీట్లు, 50 శాతం ఓట్లు, 85 శాతం సీట్లు. ఇదో హిస్టరీ. ఈ రాష్ట్రంలో ఒకే ఒక్క జగన్‌ బొమ్మ మీదే ఓట్లేశారు. నా బొమ్మ వల్లే ఓట్లేశారని ఆయన అంటున్నారంటే ఇంకా నిద్రపోయి భ్రమల్లో ఉన్నారేమో!. ఈ రాష్ట్రంలో వైసీపీ తరపున ఎవరు గెలిచినా ఒక్క వైఎస్ జగన్‌ బొమ్మ వల్లే. 151 సీట్లు వచ్చిన తర్వాత కూడా మాట్లాడుతున్నారంటే బుద్ధి ఉండాలి. అట్ల అనుకుంటే అంత కంటే మూర్ఖుడు మరొకరు ఉండరు. ఎమ్మెల్యేగానీ, ఎంపీగానీ జగన్‌ వల్లే గెలిచాం. ”

First Published:  16 Jun 2020 1:50 AM IST
Next Story