Telugu Global
NEWS

ఏడాదిలో 4వేల700 కోట్లు ఆదా

జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన పొదుపు చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఈ ఏడాది కాలంలో విద్యుత్‌ రంగంలో అమలు చేసిన పొదుపు చర్యల వల్ల ఏకంగా 4వేల 783 కోట్ల రూపాయలు ఆదా అయింది. ఒక్క విద్యుత్ కొనుగోలులోనే 700 కోట్లు ఆదా అయింది. 2018-19 ఏడాదిలో విద్యుత్ సంస్థల మొత్తం వ్యయం రూ. 48,110 కోట్లు కాగా… దాన్ని 2019-20లో రూ. 43, 327 కోట్లకు ప్రభుత్వం తగ్గించింది. దీంతో 4వేల 783 కోట్లు […]

ఏడాదిలో 4వేల700 కోట్లు ఆదా
X

జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన పొదుపు చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఈ ఏడాది కాలంలో విద్యుత్‌ రంగంలో అమలు చేసిన పొదుపు చర్యల వల్ల ఏకంగా 4వేల 783 కోట్ల రూపాయలు ఆదా అయింది.

ఒక్క విద్యుత్ కొనుగోలులోనే 700 కోట్లు ఆదా అయింది. 2018-19 ఏడాదిలో విద్యుత్ సంస్థల మొత్తం వ్యయం రూ. 48,110 కోట్లు కాగా… దాన్ని 2019-20లో రూ. 43, 327 కోట్లకు ప్రభుత్వం తగ్గించింది. దీంతో 4వేల 783 కోట్లు ఆదా అయింది. టీడీపీ హయాంలో చేసిన అప్పులకు భారీగా వడ్డీ కింద ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చింది. ఆ వడ్డీ భారం లేకుండా పొదుపు మరింత భారీగా ఉండేదని అధికారులు చెబుతున్నారు.

గత సర్కార్‌ అడ్డగోలుగా ప్రైవేట్‌ విద్యుత్‌ కొనుగోలు చేయగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పూర్తిగా కట్టడి చేసింది. 2018–19లో రూ.39,262 కోట్లున్న విద్యుత్‌ కొనుగోలు వ్యయాన్ని 2019–20లో రూ. 34,775 కోట్లకు తగ్గించగలిగారు. టీడీపీ హయాంలో సౌర విద్యుత్‌ మార్కెట్లో యూనిట్‌ రూ.2.44కే లభిస్తున్నా యూనిట్‌ రూ. 8.09 చొప్పున కొనుగోలు ఒప్పందాలు చేసుకుంది. దీని వల్ల 2019 డిసెంబర్‌ 31 నాటికి డిస్కమ్ లు రూ. 29 వేల కోట్ల మేర నష్టాలు చవిచూశాయి. పవన విద్యుత్‌లోనూ ఇదే జరిగింది.

టీడీపీ హయాంలో సగటున యూనిట్‌ విద్యుత్‌ రూ.7 చొప్పున బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయగా ఈ ఏడాది యూనిట్‌ రూ.1.63 నుంచి రూ.2.80కి మించకుండా కొనుగోలు చేశారు. ఈ చర్య వల్లే 700 కోట్లు ఆదా అయింది. బొగ్గు రవాణాలో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లడం వల్ల టన్ను బొగ్గు గతంలో 1824 రూపాయలకు వస్తుండగా… ఇప్పుడు అది రూ. 1, 027కే లభిస్తోంది.

First Published:  15 Jun 2020 5:46 AM IST
Next Story