తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా
తెలంగాణలో కరోనా కలకలం రేపుతోంది. తెలంగాణలో తక్కువ పరీక్షలు చేస్తుండడంతో వైరస్ ఏ స్థాయిలో ఉందన్నది ఒక అంచనా రావడం లేదు. ఇదే సమయంలో ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికి ఇద్దరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కరోనా బారినపడ్డారు. ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ కరోనా బారినపడ్డారు. ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆయన చికిత్స […]
తెలంగాణలో కరోనా కలకలం రేపుతోంది. తెలంగాణలో తక్కువ పరీక్షలు చేస్తుండడంతో వైరస్ ఏ స్థాయిలో ఉందన్నది ఒక అంచనా రావడం లేదు. ఇదే సమయంలో ప్రజాప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతున్నారు.
ఇప్పటికి ఇద్దరు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కరోనా బారినపడ్డారు. ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ కరోనా బారినపడ్డారు. ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చింది. దాంతో ఆయన చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లారు.
ఎమ్మెల్యే ముత్తిరెడ్డితో వారం కిందటే బాజిరెడ్డి ప్రైమరీ కాంటాక్ట్ అయినట్టు చెబుతున్నారు. మూడు రోజుల నుంచి ఎమ్మెల్యే బాజిరెడ్డి దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో నిన్న ఆయనతో పాటు, ఆయన భార్యకు కరోనా పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో బాజిరెడ్డికి పాజిటివ్, భార్యకు నెగెటివ్ వచ్చింది. ఎమ్మెల్యే కుటుంబసభ్యులు స్వీయ నిర్భందంలోకి వెళ్లారు.
ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా బారినపడిన నేపథ్యంలో… ప్రజాప్రతినిధులు తమ కార్యక్రమాలను రద్దు చేసుకుంటున్నారు. ఇళ్ల నుంచే పనులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏదైనా పని ఉంటే ఫోన్‌లోనే సంప్రదించాలని… పార్టీ ఆఫీసులకు కూడా రావొద్దని కార్యకర్తలకు నేతలు సూచిస్తున్నారు.