Telugu Global
NEWS

ప్రమాదంలో ఢిల్లీ.... గత 24 గంటల్లో 5,947 శాంపిల్స్‌లో 2,137 కరోనా పాజిటీవ్

దేశరాజధాని ఢిల్లీ నగరం కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. అక్కడ రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో 5,947 శాంపిల్స్ పరీక్షించగా.. వాటిలో 2,137 కోవిడ్-19గా నిర్థారణ అయ్యాయంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం అవుతుంది. శుక్రవారం సాయంత్రం వరకు ఢిల్లీలో 2,77,463 శాంపిల్స్ పరీక్షించారు. అయితే ఒకే రోజు ఇంత మంది పాజిటివ్‌గా నిర్థారణ కావడం ఇదే తొలిసారి. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 71 […]

ప్రమాదంలో ఢిల్లీ.... గత 24 గంటల్లో 5,947 శాంపిల్స్‌లో 2,137 కరోనా పాజిటీవ్
X

దేశరాజధాని ఢిల్లీ నగరం కరోనా హాట్‌స్పాట్‌గా మారింది. అక్కడ రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.

గడచిన 24 గంటల్లో ఢిల్లీలో 5,947 శాంపిల్స్ పరీక్షించగా.. వాటిలో 2,137 కోవిడ్-19గా నిర్థారణ అయ్యాయంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం అవుతుంది. శుక్రవారం సాయంత్రం వరకు ఢిల్లీలో 2,77,463 శాంపిల్స్ పరీక్షించారు. అయితే ఒకే రోజు ఇంత మంది పాజిటివ్‌గా నిర్థారణ కావడం ఇదే తొలిసారి.

గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 71 మంది కరోనా కారణంగా మృతి చెందగా.. 667 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం 36,824 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వారిలో 1,214 మంది మరణించగా, 13,398 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని ఢిల్లీ ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు.

ఢిల్లీలో శుక్రవారం కోవిడ్-19 పాజిటివిటీ రేటు 35.9 శాతానికి చేరినట్లు తెలిపింది. ఇప్పటి వరకు ఇదే అత్యంత అధికం కావడం గమనార్హం. 523 కొత్త రోగులు ఆసుపత్రుల్లో అడ్మిట్ అయ్యారు. కాగా, ఢిల్లీలో 9,558 బెడ్లను కేవలం కొవిడ్-19 రోగుల కోసం ఏర్పాటు చేశారు. వీటిలో ప్రస్తుతం 4,197 బెడ్లు ఖాళీగానే ఉన్నాయి. ఇక 598 ఐసీయూలకు గానూ 253 ఐసీయూలు ఖాళీగా ఉన్నాయి. ఢిల్లీలో 17,261 మంది కోవిడ్-19 రోగులు ఇండ్లలోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. ఢిల్లీలో మొత్తం 222 కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి.

First Published:  13 Jun 2020 10:42 AM IST
Next Story