Telugu Global
NEWS

చంద్రబాబు, లోకేష్‌ లను అరెస్ట్‌ చేయాలంటే భయం " జేసీ దివాకర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైనా జగన్‌కు జీహుజూర్‌ అని అనాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. తన సోదరుడు ప్రభాకర్ రెడ్డి అరెస్ట్‌పై స్పందించిన ఆయన… రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టం లేకుండా పోయాయన్నారు. ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల అరెస్ట్‌ను ఖండిస్తున్నట్టు చెప్పారు. తనను అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదన్నారు. ప్రభాకర్‌ రెడ్డిపై అభియోగాలు ఉన్న మాట వాస్తవమేనని… కానీ అస్మిత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలు మూడేళ్ల […]

చంద్రబాబు, లోకేష్‌ లను అరెస్ట్‌ చేయాలంటే భయం  జేసీ దివాకర్ రెడ్డి
X

ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైనా జగన్‌కు జీహుజూర్‌ అని అనాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. తన సోదరుడు ప్రభాకర్ రెడ్డి అరెస్ట్‌పై స్పందించిన ఆయన… రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టం లేకుండా పోయాయన్నారు. ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిల అరెస్ట్‌ను ఖండిస్తున్నట్టు చెప్పారు. తనను అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదన్నారు.

ప్రభాకర్‌ రెడ్డిపై అభియోగాలు ఉన్న మాట వాస్తవమేనని… కానీ అస్మిత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలు మూడేళ్ల క్రితం అనంతపురం సాక్షి ఆఫీస్‌ ముందు ధర్నా చేశారని… ఆ కక్షతోనే ఇద్దరినీ అరెస్ట్ చేశారని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో అరెస్ట్ అవడానికి నేరం చేయాల్సిన అవసరం లేదని… వైసీపీ పెద్దలు అనుకుంటే ఎవరినైనా అరెస్ట్ చేయిస్తారన్నారు.

అధికారులంతా రాజుగారు చెప్పింది చేస్తున్నారన్నారు. నేరాలు చేసినా, చేయకపోయినా లోపలేయాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తే అరెస్ట్ అయిపోతారన్నారు. చంద్రబాబునాయుడు, లోకేష్‌ లను అరెస్ట్ చేస్తే రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంది, శాంతిభద్రతలకు ఇబ్బంది వస్తుందన్న భయంతో మాత్రమే ఆలోచిస్తున్నారన్నారు. లేకుంటే చంద్రబాబునాయుడు, లోకేష్‌ లను కూడా అరెస్ట్ చేసి ఉండేవారన్నారు.

రాష్ట్రంలో రాజ్యాంగం, చట్టం ఏమీ లేవన్నారు. కేవలం కక్షతోనే తన సోదరుడిని అరెస్ట్‌ చేశారన్నారు. ఎవరినైనా టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకుంటే ఆ పని చేయగల సర్వశక్తివంతులు నేటి ప్రభుత్వ పెద్దలని జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేస్తామన్నారు.

అరెస్ట్‌లపై నిరసనలు తెలపడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ ఉండదన్నారు. అలా నిరసన తెలిపితే… కార్యకర్తలు ఇబ్బంది పడుతారేగానీ జగన్‌మోహన్ రెడ్డి స్పందించే పరిస్థితి లేదన్నారు. 150 రోజులుగా అమరావతిలో ధర్నాలు చేస్తున్నా స్పందించని ముఖ్యమంత్రి… ఇప్పుడు నిరసన తెలిపినంత మాత్రాన స్పందిస్తారనుకోవడం పొరపాటన్నారు.

First Published:  13 Jun 2020 3:37 AM GMT
Next Story