Telugu Global
International

సంచలన సర్వే.... కోటి మంది భారతీయులకు కరోనా

ఇండియాలో శుక్రవారం వరకు నమోదైన కేసులు 2,98,485. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా చెప్పిన కేసుల సంఖ్య ఇది. కానీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిర్వహించిన సీరో సర్వేలో కోటి మంది భారతీయులు కోవిడ్-19 భారిన పడినట్లు తేలింది. భారత దేశ జనాభాలో ఇది 0.73 శాతం. ఇది కేవలం తొలి దశ సర్వే మాత్రమే. రెండో దశలో కంటైన్మెంట్ జోన్లలో వైరస్ వ్యాప్తిపై అధ్యయనం చేయాల్సి ఉంది. మే నెలలో […]

సంచలన సర్వే.... కోటి మంది భారతీయులకు కరోనా
X

ఇండియాలో శుక్రవారం వరకు నమోదైన కేసులు 2,98,485. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా చెప్పిన కేసుల సంఖ్య ఇది. కానీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిర్వహించిన సీరో సర్వేలో కోటి మంది భారతీయులు కోవిడ్-19 భారిన పడినట్లు తేలింది. భారత దేశ జనాభాలో ఇది 0.73 శాతం. ఇది కేవలం తొలి దశ సర్వే మాత్రమే. రెండో దశలో కంటైన్మెంట్ జోన్లలో వైరస్ వ్యాప్తిపై అధ్యయనం చేయాల్సి ఉంది.

మే నెలలో ఐసీఎంఆర్ చేసిన ఈ సర్వేలో పలు విషయాలు వెల్లడయ్యాయి. అర్బన్ ప్రాంతాల్లో ముఖ్యంగా అర్బన్ స్లమ్స్‌లో వైరస్ ప్రమాదకరంగా వ్యాపిస్తున్నట్లు తేల్చింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సంఖ్య కంటే సీరో సర్వేలో తేలిన సంఖ్య 35 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. అయితే ప్రభుత్వం చెప్పే లెక్కలు ఆర్‌టీ-పీసీఆర్ టెస్టుల ద్వారా కరోనా నిర్థారణ అయిన వివరాలు మాత్రమే. కానీ, రిపోర్టు కాని బాధితుల సంఖ్య అంతకు చాలా రెట్లు ఎక్కువగా ఉంది.

ఆర్‌టీ-పీసీఆర్ గణాంకాల ఆధారంగా 8,103 మంది కరోనాతో చనిపోయారు. అంటే మరణాల రేటు 2.85 శాతంగా ఉంది. ఇదే మరణాల రేటును సీరో సర్వే గణాంకాలతో పోల్చితే కేవలం 0.08 శాతం మాత్రమే ఉంది. సీరో సర్వేలో తేలిన కోటి మందిలో చాలా మందికి అసలు కోవిడ్-19 వచ్చినట్లు కూడా తెలియదని చెబుతున్నారు. వీరందరికీ స్వల్ప లక్షణాలతో వచ్చి కరోనా నయం అయినట్లు తెలుస్తోంది.

ఇంతకూ ఈ సర్వే ఎలా చేశారంటే.. ఒక ప్రాంతంలో ర్యాండమ్‌గా వ్యక్తి నుంచి రక్తాన్ని సేకరించి పరీక్షలు జరిపారు. ఎవరి వ్యక్తి రక్తంలో అయినా ఇమ్యునోగ్లోబిన్ యాంటీ బాడీలు అభివృద్ధి చెంది ఉంటే.. వాళ్లకు అప్పటికే కోవిడ్-19 వచ్చి నయమైనట్లని నిపుణులు చెబుతున్నారు. ఇలా కోటి మందికి ఇండియాలో కరోనా వచ్చి నయమైపోయిందని చెబుతున్నారు.

మరోవైపు స్పెయిన్‌లో కూడా సీరో సర్వే చేయగా.. అక్కడ బాధితులు ఇండియా కంటే ఎక్కువగానే ఉన్నారు. శాంటా కార్లలో కూడా ఇలాంటి సర్వే చేశారు. అక్కడ 1.3 నుంచి 4.7 శాతం ఇన్ఫెక్షన్ లెవెల్స్ ఉన్నాయి. మన దేశంతో పోల్చుకుంటే అక్కడ చాలా వేగంగా వైరస్ వ్యాపిస్తోంది. ఇక రెండో దశలో కంటైన్మెంట్ జోన్లలో వైరస్ వ్యాప్తి ఎలా ఉందో సర్వే నిర్వహిస్తున్నారు. వాటి ఫలితాలు కూడా త్వరలోనే వెల్లడి కానున్నాయి.

First Published:  13 Jun 2020 1:54 AM IST
Next Story