ఇంతకీ తేజ చేస్తున్న సినిమా ఎవరి కోసం?
అలిమేలుమంగ వేంకటరమణ, రాక్షసరాజు రావణాసురుడు… ఇలా తేజ చేతిలో రెండు సినిమాలున్నాయి. వీటిలో ఒక సినిమాను గోపీచంద్ తో ప్లాన్ చేసిన తేజ, మరో సినిమాను రానాతో ప్లాన్ చేశాడు. అంతా బాగానే ఉంది కానీ ఈ రెండు సినిమాల్లో తేజ ఇప్పుడు ఏ సినిమాను స్టార్ట్ చేశాడనేది అందరికీ పెద్ద డౌట్ గా మారింది. రీసెంట్ గా ఆన్ లైన్ ఆడిషన్ స్టార్ట్ చేశాడు తేజ. హలో యాప్ ద్వారా ఆసక్తిగల యువతీయువకులు తమ వీడియోలు […]

అలిమేలుమంగ వేంకటరమణ, రాక్షసరాజు రావణాసురుడు… ఇలా తేజ చేతిలో రెండు సినిమాలున్నాయి. వీటిలో ఒక సినిమాను గోపీచంద్ తో ప్లాన్ చేసిన తేజ, మరో సినిమాను రానాతో ప్లాన్ చేశాడు. అంతా బాగానే ఉంది కానీ ఈ రెండు సినిమాల్లో తేజ ఇప్పుడు ఏ సినిమాను స్టార్ట్ చేశాడనేది అందరికీ పెద్ద డౌట్ గా మారింది.
రీసెంట్ గా ఆన్ లైన్ ఆడిషన్ స్టార్ట్ చేశాడు తేజ. హలో యాప్ ద్వారా ఆసక్తిగల యువతీయువకులు తమ వీడియోలు పంపించాలని.. అవి చూసి నటీనటుల్ని ఎంపిక చేస్తానని తేజ ప్రకటించాడు. అయితే ఈ ఆడిషన్ ఏ సినిమా కోసమనే విషయాన్ని ఈ దర్శకుడు చెప్పకపోవడం విడ్డూరం.
ప్రస్తుతానికి ఇటు గోపీచంద్, అటు రానా ఇద్దరి చేతిల్లో రెండు సినిమాలున్నాయి. కానీ ఆశ్చర్యకరంగా ఇద్దరూ ఒకేసారి ఫ్రీ అవ్వబోతున్నారు. సీటీమార్ సినిమాను గోపీచంద్ ఆగస్ట్ నెలాఖరుకు పూర్తిచేస్తాడు. అటు రానా కూడా విరాటపర్వం సినిమాను ఆగస్ట్ నాటికి పూర్తిచేయబోతున్నాడు. ఇలా ఇద్దరు హీరోలు ఒకేసారి అందుబాటులోకి రాబోతున్నారు.
సో.. వీళ్లలో ఎవరితో తేజ సెట్స్ పైకి వెళ్తాడనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం చేస్తున్న ఆడిషన్ ఏ హీరో కోసమో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే