Telugu Global
National

ఈఎస్‌ఐ స్కాంలో అచ్చెన్నాయుడు అరెస్ట్

ఏపీలో మరో సంచలనం. మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈఎస్‌ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కుంభకోణం జరిగింది. ఈఎస్‌ఐ ఆస్పత్రులకు సరఫరా చేసే మందులు, ఇతర వైద్య పరికరాల కొనుగోలులో కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారు. 2014-19 మధ్య కాలంలో ఈఎస్‌ఐ ఆస్పత్రులకు మందుల, ఇతరవైద్య పరికరాల సరఫరాలో జరిగిన అక్రమాలను నిగ్గుతేల్చేందుకు కొత్త ప్రభుత్వం గతంలో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో […]

ఈఎస్‌ఐ స్కాంలో అచ్చెన్నాయుడు అరెస్ట్
X

ఏపీలో మరో సంచలనం. మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈఎస్‌ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కుంభకోణం జరిగింది. ఈఎస్‌ఐ ఆస్పత్రులకు సరఫరా చేసే మందులు, ఇతర వైద్య పరికరాల కొనుగోలులో కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారు. 2014-19 మధ్య కాలంలో ఈఎస్‌ఐ ఆస్పత్రులకు మందుల, ఇతరవైద్య పరికరాల సరఫరాలో జరిగిన అక్రమాలను నిగ్గుతేల్చేందుకు కొత్త ప్రభుత్వం గతంలో విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.

ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఈఎస్‌ఐ మందుల కుంభకోణాన్ని ఛేదించింది. కాంట్రాక్టు లేని సంస్థల నుంచి మందులు కొనుగోలు చేసి భారీగా దోచుకున్నారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ తేల్చింది. కమిషన్లు తీసుకుని ఎలాంటి టెండర్లు లేకుండానే అర్హత లేని కంపెనీల నుంచి మందులు, ఇతర పరికరాలు కొనుగోలు చేసినట్టు బయటపడింది.

ఈ కుంభకోణంలో ఈఎస్ఐకి చెందిన ముగ్గురు మెడికల్ డైరెక్టర్లు రవికుమార్, రమేష్ కుమార్, విజయ్ కుమార్‌తో పాటు ప్రజాప్రతినిధుల ప్రమేయం ఉన్నట్టు తేలింది. మొత్తం 19 మంది ఈ కుంభకోణంలో పాలుపంచుకున్నట్టు విజిలెన్స్ తేల్చింది.

2014 నుంచి 2019 అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అర్హత లేని కంపెనీ నుంచి 89 కోట్ల 58 లక్షల విలువైన మందులు కొనుగోలు చేశారు. నిజానికి ఈ మందుల వాస్తవ విలువ కేవలం 38. 56 కోట్లు మాత్రమే. కానీ ఏకంగా 51 కోట్ల రూపాయలు అధికంగా ప్రభుత్వం నుంచి చెల్లించారు. అంటే 132 శాతం అధిక మొత్తం చెల్లించి మందులు కొనుగోలు చేశారు.

293 కోట్ల రూపాయల విలువైన మందులకొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వగా… కమిషన్ల కోసం అధికారులు, నేతలు కలిసి అధిక ధర చెల్లించి ఏకంగా 698 కోట్ల రూపాయల మందులు కొనుగోలు చేశారు. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వం మీద 404 కోట్ల రూపాయల భారం మోపారు.

ల్యాబ్‌ కిట్ల కొనుగోలులో భారీగా అవినీతి జరిగినట్టు విజిలెన్స్ తేల్చింది. 237 కోట్ల రూపాయల విలువైన ల్యాబ్ కిట్లను ఎలాంటి టెండర్లు లేకుండా నామినేషన్ పద్దతిలో కొనుగోలు చేశారు. కమిషన్ల కోసం వాస్తవ ధర కంటే 85.32 కోట్లు ఎక్కువగా చెల్లించి భారీగా ప్రజాధనాన్ని కొల్లగొట్టారు.

ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఫర్నిచర్ కొనుగోలులో 4.6 కోట్లు కాజేశారు. ఇలా మొత్తం ఈ కుంభకోణంలో 151 కోట్ల అవినీతి జరిగినట్టు విజిలెన్స్ గుర్తించింది. ఈ కుంభకోణంలో నాటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్ననాయుడు పాత్రను కూడా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బయటపెట్టింది. ఈసీజీ సర్వీసులు, టెలీ కన్సల్టెన్సీ సర్వీసు పనులను ఒక కంపెనీకి కేటాయించాల్సిందిగా అచ్చెన్నాయుడు మూడు పేజీల లేఖ ద్వారా అధికారులకు సిఫార్సు చేశారు. ఎలాంటి టెండర్లు లేకుండానే కంపెనీకి నామినేషన్ పద్దతిలో పనులు అప్పగించేలా అచ్చెన్నాయుడు చక్రం తిప్పినట్టు విచారణలో తేలింది.

ఇలా చేయడం ద్వారా అధికారులు, మంత్రి తమ అధికారాలను దుర్వినియోగం చేశారని దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఈసీజీ సేవలు బయట 200 రూపాయలకే అందుబాటులో ఉండగా… ఇక్కడ మాత్రం 480 రూపాయలు చెల్లించారని తేలింది. అచెన్నాయుడు లేఖ ఆధారంగా టెండర్లు లేకుండా నామినేషన్ పద్దతిలో అప్పగించిన పనుల్లోనూ కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు విజిలెన్స్ దర్యాప్తులో తేలింది.

First Published:  12 Jun 2020 2:45 AM IST
Next Story