చరిత్ర తవ్వుతున్న దగ్గుబాటి... అసలు టార్గెట్ ఆయనేనా?
దగ్గుబాటి వెంకటేశ్వరరావు. సీనియర్ నేత. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరపున పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆతర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన భార్య పురందేశ్వరి మాత్రం బీజేపీలో కొనసాగుతున్నారు. అయితే కరోనా లాక్‌డౌన్ టైమ్‌లో సరదాగా కుటుంబసభ్యులతో వంటావార్పుతో గడిపిన దగ్గుబాటి… ఇప్పుడు పాత చరిత్రను తవ్వుతున్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి జరిగిన సంఘటనలను ఇంతకుముందు ఆయన పుస్తకరూపంలో తీసుకొచ్చారు. ‘ఒక చరిత్ర కొన్ని నిజాలు’ అంటూ పుస్తకం రాశారు. ఇంతకుముందే […]
దగ్గుబాటి వెంకటేశ్వరరావు. సీనియర్ నేత. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరపున పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆతర్వాత నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన భార్య పురందేశ్వరి మాత్రం బీజేపీలో కొనసాగుతున్నారు. అయితే కరోనా లాక్‌డౌన్ టైమ్‌లో సరదాగా కుటుంబసభ్యులతో వంటావార్పుతో గడిపిన దగ్గుబాటి… ఇప్పుడు పాత చరిత్రను తవ్వుతున్నారు.
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి జరిగిన సంఘటనలను ఇంతకుముందు ఆయన పుస్తకరూపంలో తీసుకొచ్చారు. ‘ఒక చరిత్ర కొన్ని నిజాలు’ అంటూ పుస్తకం రాశారు. ఇంతకుముందే తెలుగుదేశం పార్టీ గురించి ఈ పుస్తకం ద్వారా చెప్పిన ఆయన… ఇప్పుడు ఫేస్‌బుక్ ద్వారా మరికొన్ని విషయాలు వెలుగులోకి తెస్తున్నారు.
మే 29 తెలుగుదేశం ఆవిర్బావ దినోత్సం నుంచి ఆయన తన ఫేస్‌బుక్ వాల్‌లో రెండు, మూడు రోజులకు ఒకసారి కొత్త విషయాలు పంచుకుంటున్నారు. ఇప్పటివరకూ పంచుకున్న వాటిలో ముఖ్యమైనవి….
2014 ఎన్నికల ముందు తెలుగుదేశంలోకి పురందేశ్వరిని చేర్చాలని ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణతో పాటు పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర ప్రయత్నాలు చేశారని…. చంద్రబాబు దగ్గరకు రాయబారం నడిపారని దగ్గుబాటి చెప్పారు. అయితే భువనేశ్వరి పేరు చెప్పి చంద్రబాబు తప్పుకున్నారని అయన అన్నారు.
పార్టీలోకి పురందేశ్వరిని తీసుకుని వెళ్లే విషయంపై భువనేశ్వరి కూడా ప్రయత్నాలు చేశారని ఆయన గుర్తు చేశారు. కానీ పార్టీ ఎమ్మెల్యేలకు భువనేశ్వరి ఒప్పుకోవడం లేదని చెప్పి చంద్రబాబు తప్పించుకున్నారని అన్నారు.
ఆ తర్వాత 2014 లో పురంధేశ్వరి బీజేపీపార్టీలో చేరారు. అప్పుడు పురంధరేశ్వరికి బీజేపీ తరఫున టిక్కెట్ ఇస్తే మళ్ళీ పొత్తులు ఉండవని చంద్రబాబు తేల్చి చెప్పారట. బీజేపీ నేతలు ఒప్పుకోకపోవడంతో… ఓడిపోయే సీటైన రాజంపేట కు పంపించారని దగ్గుబాటి చెప్పారు.
రాజంపేటలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మూడు అసెంబ్లీ సెగ్మెంట్లకు తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థులు ఉన్నా లేనట్లు గా ఉండే వారిని చంద్రబాబు ఎంపిక చేశారట. పీలేరు, రాయచోటి, పుంగనూరు అభ్యర్థులు ఉన్నా లేనట్లే. ప్రచారానికి 15 రోజుల సమయమే ఉన్నప్పటికీ, పురందేశ్వరి ఎన్నికల ప్రచారం చేస్తుంటే ఈ అభ్యర్థులు ఇంట్లో నుండి బయటకు కూడా రాలేదు. ఏజెంట్లు కూడా లేకుండానే ఎన్నికలు జరిగాయని దగ్గుబాటు రాసుకొచ్చారు.
ఇక ఇప్పటివరకూ ఎన్టీఆర్ చైతన్య రథం నడిపింది హరికృష్ణ అనుకునేవారు. అయితే పార్టీ పెట్టిన కొత్తలో ఏడునెలల పాటు చైతన్యరథం నడిపింది ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి అని చెప్పారు దగ్గుబాటి. రామకృష్ణ స్టూడియో డ్రైవర్. అతని తండ్రి నిజాం నవాబుకు డ్రైవర్ గా పని చేసేవారట. రామారావు ఇతనిని ఏమండీ రెడ్డి గారు అంటూ ఎంతో గౌరవంగా పిలిచేవారట. ఈ మధ్యనే అనుకోకుండా ప్రతాపరెడ్డి దగ్గుబాటిని కలిసి, ఆనాటి ప్రచారాన్ని, ఆనాటి సంఘటనలును గుర్తు చేశారట.
హరికృష్ణ 1984 ఆగస్టులో నాదెండ్ల భాస్కరరావు ఉదంతం తర్వాత రామారావు రాష్ట్ర వ్యాప్తంగా చైతన్యరథంపై పర్యటిస్తున్నప్పుడు డ్రైవింగ్ సీట్ లోకి వచ్చారని చెప్పారు.
ఇక్కడే ఇంకో విషయం కూడా దగ్గుబాటి క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ చరిత్ర , సంఘటనలు గురించి ప్రస్తావించేటప్పుడు చంద్రబాబు గురించి ప్రస్తావన రాకుండా ఉండటమనేది సాధ్యం కాదు. అయితే నేను ఏదో ఆయన పై వ్యతిరేకతతో చెబుతున్నానని భావించే అవకాశం ఉంటుంది. అందుచేత ఈ కథనాలు చదివేవారు అన్యదా భావించ వద్దు . నాకు తెలిసిన సత్యాలను చెప్పే ప్రయత్నం మాత్రమే నేను చేస్తున్నాను…. అంటూ దగ్గుబాటి ఈ క్లారిటీ ఇవ్వడంతో ఫేస్‌బుక్ పేజీలో ఆయన కథనాలు రాబోయే రోజుల్లో ఎలాంటి వేడి పుట్టించబోతున్నాయనే చర్చ మొదలైంది.
మొత్తానికి సోషల్ మీడియా సాక్షిగా దగ్గుబాటి ఏమైనా బాంబులు పేల్చుతారా? లేక తనకు తెలిసిన విషయాలను మరోసారి పంచుకుంటున్నారా? అనేది రాబోయే రోజుల్లో తేలుతుంది.