తంతే చంద్రబాబు విజయవాడలో వచ్చి పడ్డాడు... మేం ముందే చెప్పాం...
టీడీపీ అధ్యక్షుడిపై సీపీఐ నేత నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు చేయాల్సిన తప్పులన్నీ చేసి ఇప్పుడు తాను ఎందుకు ఓడిపోయానో అర్థం కావడం లేదంటూ చంద్రబాబు అమాయకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. టీడీపీ ఎందుకు ఓడిపోయిందో చంద్రబాబుకు నిజంగానే తెలియదా అని ప్రశ్నించారు. రాజకీయ తప్పిదాల వల్లనే చంద్రబాబు ఓడిపోయారన్నారు. 93 లక్షల కుటుంబాలకు పథకాల ద్వారా సాయం చేశామని… వారంతా ఓట్లేస్తారని చంద్రబాబు భావించారన్నారు. కానీ ఆ 93 లక్షల కుటుంబాలకు సాయం చేసే సమయానికే […]
టీడీపీ అధ్యక్షుడిపై సీపీఐ నేత నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు చేయాల్సిన తప్పులన్నీ చేసి ఇప్పుడు తాను ఎందుకు ఓడిపోయానో అర్థం కావడం లేదంటూ చంద్రబాబు అమాయకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
టీడీపీ ఎందుకు ఓడిపోయిందో చంద్రబాబుకు నిజంగానే తెలియదా అని ప్రశ్నించారు. రాజకీయ తప్పిదాల వల్లనే చంద్రబాబు ఓడిపోయారన్నారు. 93 లక్షల కుటుంబాలకు పథకాల ద్వారా సాయం చేశామని… వారంతా ఓట్లేస్తారని చంద్రబాబు భావించారన్నారు. కానీ ఆ 93 లక్షల కుటుంబాలకు సాయం చేసే సమయానికే టీడీపీ వెంటిలేటర్‌పైకి చేరి అంపశయ్యపై పడుకుందని నారాయణ వ్యాఖ్యానించారు.
ప్రత్యేక హోదా సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే విజయవాడకు మకాం మార్చాల్సిందిగా తాను, సీపీఐ రామకృష్ణ సలహా ఇచ్చామని… కానీ చంద్రబాబు మాత్రం హైదరాబాద్ పై పదేళ్లు హక్కు ఉందంటూ వాదించారన్నారు.
తీరా ఓటుకు నోటు కేసులో ముడ్డి మీద తంతే అప్పుడు విజయవాడలో చంద్రబాబు వచ్చి పడ్డారని నారాయణ ఎద్దేవా చేశారు. ముందే తాము చెప్పినట్టు మర్యాదగా విజయవాడకు వచ్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు.
రాజధానికి నాలుగువేల ఎకరాలు చాలని తాము చెబితే … కమ్యూనిస్టు పార్టీ ఆఫీసులు మాత్రం నాలుగైదు ఎకరాల్లో ఉండాలి… ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం విశాలంగా ఉండకూడదా అంటూ చంద్రబాబు ఎదురు ప్రశ్నించారన్నారు.
అత్యాశకు పోయి చివరకు అమరావతి విషయంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. ఆఖరిలో అంపశయ్యపై పడుకుని బీజేపీతో యుద్ధం చేసినట్టు చంద్రబాబు నటించారని నారాయణ విమర్శించారు.