Telugu Global
National

సీబీఐ విచారణకు కేబినెట్ ఆమోదం

ఏపీ కేబినెట్‌ భేటీలో సంచలన నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని నిర్ణయించింది. చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన అక్రమాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా… ఫైబర్‌గ్రిడ్, రంజాన్ తోఫా, చంద్రన్న కానుకలపై సీబీఐ విచారణ జరిపించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. పైబర్‌ గ్రిడ్‌లో వెయ్యి కోట్ల రూపాయల టెండర్లలో భారీగా అక్రమాలు జరిగాయని ఉపసంఘం నివేదిక ఇచ్చింది. ఈ అంశంపై సీబీఐ […]

సీబీఐ విచారణకు కేబినెట్ ఆమోదం
X

ఏపీ కేబినెట్‌ భేటీలో సంచలన నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన అవినీతి వ్యవహారాలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని నిర్ణయించింది. చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన అక్రమాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా… ఫైబర్‌గ్రిడ్, రంజాన్ తోఫా, చంద్రన్న కానుకలపై సీబీఐ విచారణ జరిపించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది.

పైబర్‌ గ్రిడ్‌లో వెయ్యి కోట్ల రూపాయల టెండర్లలో భారీగా అక్రమాలు జరిగాయని ఉపసంఘం నివేదిక ఇచ్చింది. ఈ అంశంపై సీబీఐ విచారణకు కమిటీ సిఫార్సు చేసింది. సెట్ టాప్ బాక్స్ లతో పాటు ఇతర పరికరాల కొనుగోలులో భారీగా అక్రమాలు జరిగాయని ఉపసంఘం తన నివేదికలో వివరించింది.

ఈవీఎంల ట్యాంపరింగ్‌ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పైబర్ గ్రిడ్ సలహాదారుడు వేమూరి హరిప్రసాద్‌ కేంద్రంగా ఫైబర్‌ గ్రిడ్‌లో కుంభకోణం జరిగిందని సబ్ కమిటీ గుర్తించింది. పైబర్‌ గ్రిడ్‌ వ్యవహారంలో 200 కోట్ల రూపాయల అక్రమాలు చంద్రన్న కానుక, రంజాన్‌ తోఫాలో 150 కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగినట్టు సబ్ కమిటీ నిర్ధారించింది.

టెండర్ నిబంధనలను ఏ విధంగా ఉల్లంఘించారు అన్న దానిపై ఉప సంఘం ఆధారాలతో సహా నివేదికను సిద్ధం చేసి ముఖ్యమంత్రికి అందించారు. చంద్రన్న కానుక, రంజాన్‌ తోఫాలో అందించిన నెయ్యి వ్యవహారంలో భారీగా అక్రమాలు జరిగినట్టు ఉపసంఘం తేల్చింది. హెరిటేజ్ సంస్థ నుంచి నెయ్యి కొనుగోలు వెనుక గోల్‌మాల్ జరిగినట్టు వెల్లడించింది.

First Published:  11 Jun 2020 12:06 PM IST
Next Story