బ్లాక్‌మెయిల్ చేసి మహిళా టెకీపై అత్యాచారం
హైదరాబాద్‌లో ఒక మహిళా టెకీని వేధింపులకు గురిచేయడంతో పాటు ఆమెపై అత్యాచారం చేశాడో వ్యక్తి. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు పరిచయం పెంచుకుని ఆ తర్వాత ఆమెకు నిత్యం నరకం చూపించాడో యువకుడు. వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కూకట్‌పల్లిలోని ఒక హాస్టల్‌లో ఉంటున్న యువతి కొన్ని నెలల క్రితం ఒక సాప్ట్‌వేర్ కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్లింది. ఆ ఇంటర్వ్యూకే వచ్చిన మరో యువకుడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఇంటర్వ్యూలో […]
హైదరాబాద్‌లో ఒక మహిళా టెకీని వేధింపులకు గురిచేయడంతో పాటు ఆమెపై అత్యాచారం చేశాడో వ్యక్తి. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు పరిచయం పెంచుకుని ఆ తర్వాత ఆమెకు నిత్యం నరకం చూపించాడో యువకుడు. వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కూకట్‌పల్లిలోని ఒక హాస్టల్‌లో ఉంటున్న యువతి కొన్ని నెలల క్రితం ఒక సాప్ట్‌వేర్ కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్లింది. ఆ ఇంటర్వ్యూకే వచ్చిన మరో యువకుడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఇంటర్వ్యూలో ఉద్యోగానికి యువతి ఎంపిక కాగా… యువకుడు కాలేదు. అయినా సరే ఆ తర్వాత కూడా ఆమెకు అప్పుడప్పుడు ఎదురుపడి మాట్లాడేవాడు. ఆమె హాస్టల్ వైపు వెళ్లేవాడు. అలా కాస్త చనువు పెంచుకున్నాడు. అమ్మాయిని రెస్టారెంట్లకు కూడా తీసుకెళ్లేవాడు.
కొద్దిరోజుల క్రితం ప్రేమిస్తున్నట్టు చెప్పగా… ఆ అమ్మాయి సున్నితంగా తిరస్కరించింది. సరే స్నేహితులుగానే ఉందామంటూ నమ్మించి ఆ తర్వాత వేధింపులు మొదలుపెట్టాడు. గతంలో అమ్మాయితో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫోటోల సాయంతో బ్లాక్‌మెయిల్ చేశాడు. తనను వదిలేయాలని వేడుకున్నా వినలేదు.
కొద్దిరోజుల క్రితం హోటల్‌కు పిలిపించుకుని తన కోరిక తీరిస్తే ఇక ఎన్నడూ నీ జోలికి రాను అంటూ నమ్మించాడు. అలా ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆ దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించాడు. వాటితో తిరిగి బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు.
తనను పెళ్లి చేసుకోవాలి… జీతం మొత్తం తనకు ఇవ్వాలంటూ వేధించాడు. ఇంతలో లాక్‌డౌన్ రావడంతో ఆమె తన సొంతూరుకు వెళ్లిపోయింది. అయినా వేధింపులు ఆగలేదు. నిత్యం ఆమెకు వీడియో కాల్ చేసి… తాను చెప్పినట్టు చేయాలంటూ వేధించాడు. ఈ వేధింపులు భరించలేకపోయిన యువతి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. ఒకరోజు ఒంటరిగా విలపిస్తుండగా గమనించిన ఆమె సోదరుడు ఆరా తీయగా తాను ఎదుర్కొంటున్న వేధింపుల గురించి వివరించింది.
యువతి తన అన్నతో కలిసి వెళ్లి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ దారుణం గురించి తెలుసుకున్న సీపీ సజ్జనార్ వెంటనే యువకుడి అరెస్ట్‌కు పోలీసులను రంగంలోకి దింపారు. వారు సదరు యువకుడిని అరెస్ట్ చేశారు.