జగన్‌తో సినీ ఇండస్ట్రీ పెద్దల భేటీ.... విశాఖకు బూస్ట్ ఇస్తారా?
ఏడాది తర్వాత ఏపీ సీఎంను టాలీవుడ్ పెద్దలు కలవబోతున్నారు. సైరా సినిమా సమయంలో చిరంజీవి దంపతులు కలిశారు. ఆతర్వాత నిర్మాత సురేష్ బాబు ఆధ్వర్యంలో కొందరు వెళ్లి సమావేశమయ్యారు. కానీ ఈసారి పెద్దలందరూ వెళ్లి జగన్‌తో భేటీ కావడం ఇదే ఫస్ట్ టైమ్. దాసరి ప్లేస్‌ను భర్తీ చేసే ఆలోచనలో ఉన్న చిరంజీవి సినీ పరిశ్రమ సమస్యలపై చొరవ తీసుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. సినీ పరిశ్రమ సమస్యలపై ప్రభుత్వం ధృష్టికి తీసుకెళ్లారు. వివిధ […]
ఏడాది తర్వాత ఏపీ సీఎంను టాలీవుడ్ పెద్దలు కలవబోతున్నారు. సైరా సినిమా సమయంలో చిరంజీవి దంపతులు కలిశారు. ఆతర్వాత నిర్మాత సురేష్ బాబు ఆధ్వర్యంలో కొందరు వెళ్లి సమావేశమయ్యారు. కానీ ఈసారి పెద్దలందరూ వెళ్లి జగన్‌తో భేటీ కావడం ఇదే ఫస్ట్ టైమ్.
దాసరి ప్లేస్‌ను భర్తీ చేసే ఆలోచనలో ఉన్న చిరంజీవి సినీ పరిశ్రమ సమస్యలపై చొరవ తీసుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. సినీ పరిశ్రమ సమస్యలపై ప్రభుత్వం ధృష్టికి తీసుకెళ్లారు. వివిధ సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
ఇప్పుడు ఏపీ సీఎం జగన్‌ను 20 మంది సినీ ప్రతినిధుల బృందం కలవబోతోంది. విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధికి తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా జగన్ వివరించే అవకాశం ఉంది. దీంతో పాటు సినీ పెద్దలకు తమ ప్రభుత్వం తరపున కొన్ని హామీలు ఇచ్చే అవకాశం ఉంది.
తెలంగాణలో ఇప్పటికే సినిమా,టీవీ షూటింగ్‌లకు అనుమతి ఇచ్చారు. ఇప్పుడు ఏపీలో కూడా రేపోమాపో పర్మిషన్ ఇచ్చే చాన్స్ కనిపిస్తోంది. కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్‌లు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తానికి సీఎం జగన్‌తో సినీ పెద్దల భేటీపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది అనేది మాత్రం వాస్తవం.