Telugu Global
Cinema & Entertainment

షూటింగ్ రూల్స్ జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణలో సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్స్ కు అనుమతినిచ్చిన ప్రభుత్వం.. ఆ మేరకు ఈరోజు మార్గదర్శకాలు, నిబంధనలు జారీ చేసింది. లాక్ డౌన్ పరిమితులకు లోబడి షూటింగ్స్ కు అనుమతినిచ్చిన ప్రభుత్వం.. సగం పూర్తయిన సినిమాలు, టీవీ సీరియళ్ల షూటింగ్స్ కు మాత్రమే అనుమతి ఇచ్చింది. కొత్తగా సినిమాలకు కొబ్బరికాయ కొట్టి, షూటింగ్ మొదలుపెట్టడానికి వీళ్లేదు. ప్రతి ఒక్కరి నుంచి మెడికల్ డిక్లరేషన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించిన ప్రభుత్వం.. లొకేషన్ లో భౌతిక దూరం పాటించడంతో పాటు […]

షూటింగ్ రూల్స్ జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
X

తెలంగాణలో సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్స్ కు అనుమతినిచ్చిన ప్రభుత్వం.. ఆ మేరకు ఈరోజు మార్గదర్శకాలు, నిబంధనలు జారీ చేసింది. లాక్ డౌన్ పరిమితులకు లోబడి షూటింగ్స్ కు అనుమతినిచ్చిన ప్రభుత్వం.. సగం పూర్తయిన సినిమాలు, టీవీ సీరియళ్ల షూటింగ్స్ కు మాత్రమే అనుమతి ఇచ్చింది. కొత్తగా సినిమాలకు కొబ్బరికాయ కొట్టి, షూటింగ్ మొదలుపెట్టడానికి వీళ్లేదు.

ప్రతి ఒక్కరి నుంచి మెడికల్ డిక్లరేషన్ తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించిన ప్రభుత్వం.. లొకేషన్ లో భౌతిక దూరం పాటించడంతో పాటు మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని నిబంధన విధించింది. అంతేకాకుండా.. షూటింగ్ స్పాట్ లో తప్పనిసరిగా ఓ డాక్టర్ అందుబాటులో ఉండాలనే కండిషన్ పెట్టింది.

ఆర్టిస్టుల ఆరోగ్య భద్రత పూర్తిగా నిర్మాత బాధ్యతన్న ప్రభుత్వం.. లొకేషన్ లో 40 మందికి మించి కనిపించకూడదని, శానిటైజ్ చేసిన తర్వాత ఆర్టిస్టులను లోనికి పంపించాలని సూచించింది. ఎంట్రీ, ఎగ్జిట్ గేట్స్ వద్ద తప్పనిసరిగా హ్యాండ్ వాష్ లేదా శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. కంటైన్మెంట్ జోన్లలో షూటింగ్ చేయకూడదని… మేకప్ ఆర్టిస్టులు, హెయిర్ డ్రెస్సర్లు తప్పనిసరిగా పీపీఈ కిట్లు ధరించాలని ఆదేశించింది.

First Published:  9 Jun 2020 1:24 PM IST
Next Story