అనితారాణి వ్యవహారంపై సీఐడీ విచారణకు సీఎం ఆదేశం
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పెనుమూరు ప్రభుత్వ వైద్యురాలు చేసిన ఆరోపణలపై సీఐడీ విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించారు. అధికారులు తనను వేధిస్తున్నారని… వైసీపీ నేతలు కొందరు ఇటీవల తనను గదిలో బంధించారంటూ ఆమె ఆరోపణలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన టీడీపీ మాజీఎమ్మెల్యే అనితా ఆమెకు ఫోన్ చేసి పరామర్శించారు. ఫోన్ సంభాషణల్లో డాక్టర్ అనితారాణి చేసిన ఆరోపణలు సీఎం దృష్టికి రావడంతో ఆయన విచారణకు ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సీఐడీ ప్రత్యేక బృందాలను క్షేత్రస్థాయికి […]
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం పెనుమూరు ప్రభుత్వ వైద్యురాలు చేసిన ఆరోపణలపై సీఐడీ విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించారు. అధికారులు తనను వేధిస్తున్నారని… వైసీపీ నేతలు కొందరు ఇటీవల తనను గదిలో బంధించారంటూ ఆమె ఆరోపణలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన టీడీపీ మాజీఎమ్మెల్యే అనితా ఆమెకు ఫోన్ చేసి పరామర్శించారు. ఫోన్ సంభాషణల్లో డాక్టర్ అనితారాణి చేసిన ఆరోపణలు సీఎం దృష్టికి రావడంతో ఆయన విచారణకు ఆదేశించారు.
సీఎం ఆదేశాలతో సీఐడీ ప్రత్యేక బృందాలను క్షేత్రస్థాయికి పంపుతున్నట్టు సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ చెప్పారు. ఈ వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశించినట్టు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ చెప్పారు.
అయితే డాక్టర్ అనితా రాణి ట్రాక్ రికార్డుపై అధికారులు అనేక విషయాలు వెల్లడిస్తున్నారు. ఆమె తొలి నుంచి వివాదాస్పదంగానే ఉన్నారని జిల్లా వైద్యాధికారులు చెబుతున్నారు.
డాక్టర్ అనితారాణి ఎక్కడ పనిచేసినా అక్కడ వివాదాలు వస్తుంటాయని జిల్లా డీఎంహెచ్‌వో పెంచలయ్య వివరించారు. ఇప్పుడు ఆమె చేస్తున్న ఆరోపణలు కూడా అవాస్తవమన్నారు. అనితారాణి సర్వీసు ప్రారంభమై 18ఏళ్లు గడుస్తున్నా… ఇంకా ప్రొబేషన్ డిక్లేర్ చేయలేదంటే దాన్ని బట్టే ఆమె పనితీరు తెలుసుకోవచ్చన్నారు.
అనితారాణిని ఎవరూ కులం పేరుతో దూషించలేదని… ఆమెను ఎవరూ గదిలో బంధించలేదని చిత్తూరు జిల్లా ఎస్సీఎస్టీ విభాగం డీఎస్పీ కేశప్ప తెలిపారు. తనను ఇటీవల టీబీ వార్డుకు డిప్యూట్ చేయడంపై డాక్టర్ అనితారాణి ఆగ్రహంగా ఉన్నారు.