Telugu Global
NEWS

తెలంగాణలో షూటింగ్స్ కు అనుమతి

టాలీవుడ్ అంతా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. తెలంగాణలో సినిమా షూటింగ్స్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతినిచ్చారు. దీనికి సంబంధించిన ఫైల్ పై కేసీఆర్ ఈరోజు సంతకం చేశారు. రాష్ట్రంలో పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ సినిమా లేదా టీవీ షూటింగులు నిర్వహించుకోవచ్చని, షూటింగులు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే చేసుకోవచ్చని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే థియేటర్ల ఓపెనింగ్ పై మాత్రం కేసీఆర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేంద్ర […]

తెలంగాణలో షూటింగ్స్ కు అనుమతి
X

టాలీవుడ్ అంతా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. తెలంగాణలో సినిమా షూటింగ్స్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతినిచ్చారు. దీనికి సంబంధించిన ఫైల్ పై కేసీఆర్ ఈరోజు సంతకం చేశారు.

రాష్ట్రంలో పరిమిత సిబ్బందితో, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిస్తూ సినిమా లేదా టీవీ షూటింగులు నిర్వహించుకోవచ్చని, షూటింగులు పూర్తయిన వాటి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వెంటనే చేసుకోవచ్చని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

అయితే థియేటర్ల ఓపెనింగ్ పై మాత్రం కేసీఆర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి, థియేటర్ల ఓపెనింగ్ పై నిర్ణయాన్ని వాయిదావేశారు. దీనిపై మరో సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి షూటింగులకు, పోస్టు ప్రొడక్షన్ పనులకు, సినిమా థియేటర్లు తెరవడానికి అనుమతి ఇవ్వాలని కోరారు.

దీనికి సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సినీరంగ ప్రముఖులు సమావేశమై విధివిధానాల ముసాయిదా రూపొందించారు.

ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి, పరిమిత సిబ్బందితో షూటింగులు, పోస్టు ప్రొడక్షన్ పనులు నిర్వహించుకుంటామని సినీ రంగ ప్రముఖులు హామీ ఇచ్చారు. దీనిని అనుసరించి ముఖ్యమంత్రి కేసీఆర్ షూటింగులు, పోస్టు ప్రొడక్షన్ పనులకు అనుమతి ఇచ్చారు.

First Published:  8 Jun 2020 3:08 PM IST
Next Story