టీడీపీ నుంచి వైసీపీలోకి 12 మంది... కరణం బలరాం జోస్యం
టీడీపీ నుంచి వైసీపీలోకి 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు జంప్ కావడం ఖాయమని చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం చెప్పారు. నియోజకవర్గాల అభివృద్ది కోసం అధికార పార్టీలో చేరేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నారని అయన అన్నారు. 10 నుంచి 12 మంది మాత్రం పార్టీ మారడం ఖాయమని జోస్యం చెప్పారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో టీడీపీ ఎమ్మెల్యేలే కాదు… చాలా మంది ముఖ్య నేతలు కూడా టచ్‌లో ఉన్నారని కరణం బలరాం చెప్పారు. […]
టీడీపీ నుంచి వైసీపీలోకి 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు జంప్ కావడం ఖాయమని చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం చెప్పారు. నియోజకవర్గాల అభివృద్ది కోసం అధికార పార్టీలో చేరేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ముందుకు వస్తున్నారని అయన అన్నారు. 10 నుంచి 12 మంది మాత్రం పార్టీ మారడం ఖాయమని జోస్యం చెప్పారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో టీడీపీ ఎమ్మెల్యేలే కాదు… చాలా మంది ముఖ్య నేతలు కూడా టచ్‌లో ఉన్నారని కరణం బలరాం చెప్పారు. ప్రకాశం జిల్లా నుంచి ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే సమాచారం తన దగ్గర ఉందని చెప్పుకొచ్చారు. మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డితో ఇప్పటికే చాలా మంది టచ్‌లో ఉన్నారని… వారు పార్టీలోకి వచ్చేందుకు కొంత సమయం పట్టొచ్చని వివరించారు.
చంద్రబాబుకి, జగన్‌కి చాలా తేడా ఉందని కరణం చెప్పారు. నమ్ముకున్న వాళ్లకి న్యాయం చేసే వ్యక్తి జగన్ అని తెలిపారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో కూడా తనకు సన్నిహిత సంబంధాలు ఉండేవని ఈ సందర్భంగా గుర్తు చేశారు. టీడీపీలో చాలా కాలం నుంచి ఉన్నామని… కానీ తనలాంటి వారు చాలా ఇబ్బందిపడ్డారని అన్నారు.
చంద్రబాబు నిర్లక్ష్యం వల్లే వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కాలేదని… కానీ ఇప్పుడు ఏడాది కాలంగా పనులు వేగంగా జరుగుతున్నాయిని కరణం చెప్పారు. త్వరలోనే ప్రాజెక్టు పూర్తి అయ్యే అవకాశం వచ్చిందని చెప్పారు. చంద్రబాబు హామీ ఇచ్చి మర్చిపోయే రకమని… కానీ జగన్ అలాంటివారు కాదని అన్నారు.