Telugu Global
NEWS

గుజరాత్‌ కాంగ్రెస్‌లో కలవరం... రాజ్యసభ ఎన్నికల వేళ క్యాంప్‌ రాజకీయం...

రాజ్యసభ ఎన్నికల వేళ గుజరాత్‌ కాంగ్రెస్‌లో కలవరం మొదలైంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. మరింత మంది వారి బాటలోనే నడిచే అవకాశముందని తేలడంతో కాంగ్రెస్‌ పెద్దలు అలర్ట్‌ అయ్యారు. 19 మంది ఎమ్మెల్యేలను రాజస్థాన్‌ క్యాంప్‌కు తరలించారు. గుజరాత్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 65 మందిని వివిధ రిసార్ట్ ‌లకు ఇప్పటికే తరలించారు. అయితే క్యాంపులపై కొందరు కాంగ్రెస్‌ నేతలే ఫిర్యాదు చేయడంతో 19 మంది ఎమ్మెల్యేలను […]

గుజరాత్‌ కాంగ్రెస్‌లో కలవరం... రాజ్యసభ ఎన్నికల వేళ క్యాంప్‌ రాజకీయం...
X

రాజ్యసభ ఎన్నికల వేళ గుజరాత్‌ కాంగ్రెస్‌లో కలవరం మొదలైంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోంది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేశారు. మరింత మంది వారి బాటలోనే నడిచే అవకాశముందని తేలడంతో కాంగ్రెస్‌ పెద్దలు అలర్ట్‌ అయ్యారు. 19 మంది ఎమ్మెల్యేలను రాజస్థాన్‌ క్యాంప్‌కు తరలించారు.

గుజరాత్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 65 మందిని వివిధ రిసార్ట్ ‌లకు ఇప్పటికే తరలించారు. అయితే క్యాంపులపై కొందరు కాంగ్రెస్‌ నేతలే ఫిర్యాదు చేయడంతో 19 మంది ఎమ్మెల్యేలను రాజస్థాన్‌కు షిప్ట్‌ చేశారు.

గుజరాత్‌ అసెంబ్లీలో మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 182. బీజేపీకి 103 మంది ఉన్నారు, రాజ్యసభ సీటు గెలవాలంటే 34 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. కాంగ్రెస్‌ ఈజీగా రెండు సీట్లు గెలిచే అవకాశం ఉండేది. దీంతో బీజేపీ ఇక్కడ పావులు కదిపింది. రాజ్యసభ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడగానే నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆతర్వాత ఇప్పుడు ముగ్గురు పార్టీకి గుడ్‌ బై చెప్పారు. దీంతో ప్రస్తుతం ఉన్న సంఖ్యతో కాంగ్రెస్‌ ఒకే ఒక సీటుగెలిచే అవకాశం కన్పిస్తోంది.

నాలుగు రాజ్యసభ సీట్లకు ఇప్పుడు అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ తరపున ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ తరపున ఇద్దరు పోటీలోకి దిగారు. దీంతో పార్టీలో చర్చ మొదలైంది. ఒకే ఒక ఎన్సీపీ ఎమ్మెల్యే కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తారని ప్రకటించారు. చివరి నిమిషం వరకూ ఆయన ఎటు ఓటు వేసేది సస్పెన్స్‌గానే మారింది.

First Published:  8 Jun 2020 3:56 AM IST
Next Story