పవన్ ఓకే కానీ దిల్ రాజు నో
కరోనా వైరస్ హైదరాబాద్ లో రోజురోజుకు ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. రాబోయే రోజుల్లో వైరస్ వ్యాప్తి ఇంకాస్త ఎక్కువగా ఉంటుందని స్వయంగా వైద్య నిపుణులు, అధికారులు చెబుతున్నారు. దీంతో మహేష్, బన్నీ, చిరంజీవి లాంటి హీరోలు తమ సినిమాల షూటింగ్స్ ను వాయిదా వేసుకుంటున్నారు. మరో వారం రోజుల్లో షూటింగ్స్ ప్రారంభించుకోవచ్చంటూ ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ, వీళ్లు మాత్రం వెనక్కి తగ్గుతున్నారు. అయితే ఈ విషయంలో పవన్ కల్యాణ్ మాత్రం ముందున్నాడు. ప్రభుత్వం షూటింగ్స్ కు అనుమతులు […]
కరోనా వైరస్ హైదరాబాద్ లో రోజురోజుకు ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. రాబోయే రోజుల్లో వైరస్ వ్యాప్తి ఇంకాస్త ఎక్కువగా ఉంటుందని స్వయంగా వైద్య నిపుణులు, అధికారులు చెబుతున్నారు. దీంతో మహేష్, బన్నీ, చిరంజీవి లాంటి హీరోలు తమ సినిమాల షూటింగ్స్ ను వాయిదా వేసుకుంటున్నారు.
మరో వారం రోజుల్లో షూటింగ్స్ ప్రారంభించుకోవచ్చంటూ ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ, వీళ్లు మాత్రం వెనక్కి తగ్గుతున్నారు. అయితే ఈ విషయంలో పవన్ కల్యాణ్ మాత్రం ముందున్నాడు.
ప్రభుత్వం షూటింగ్స్ కు అనుమతులు ఇచ్చిన తర్వాత ఎప్పుడు కోరితే అప్పుడు సెట్స్ పైకి రావడానికి పవన్ కల్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. యూనిట్ దే ఆలస్యమని, తను ఎప్పుడైనా సెట్స్ పైకి రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేశాడు. అయితే పవన్ ప్రతిపాదనకు దిల్ రాజు నో చెబుతున్నాడు.
ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కరోనా వైరస్ ను కట్టడి చేయడం కష్టంగా మారుతున్న వేళ.. తన షూటింగ్ స్పాట్ లో ఎవరికైనా వైరస్ సోకితే, అది మొత్తంగా సినిమా యూనిట్ పైనే ప్రభావం చూసిస్తుందని దిల్ రాజు భయపడుతున్నాడు. పైగా పవన్ కల్యాణ్ లాంటి హీరో నటిస్తున్న సినిమా సెట్స్ లో వైరస్ సోకినట్టు వార్త బయటకొస్తే.. అది పవన్ ఇమేజ్ కే భంగం.
అందుకే పవన్ ఓకే చెప్పినప్పటికీ దిల్ రాజు మాత్రం వేచి చూసే ధోరణిలో ఉన్నాడు. వకీల్ సాబ్ సినిమాకు సంబంధించి పవన్ నుంచి 35 రోజుల కాల్షీట్లు సిద్ధంగా ఉన్నాయి. 35 రోజులు షూటింగ్ చేస్తే సినిమా కంప్లీట్ అవుతుంది.