ఏసీబీ వలలో గ్రేటర్ రెవెన్యూ, పోలీసులు
గ్రేటర్‌లో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. శనివారం పది గంటల పాటు మూడు చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. షేక్‌పేట ఎమ్మార్వో కార్యాలయం, తహసీల్దార్ సుజాత నివాసం, బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఆర్డీవో వసంతకుమారిని కూడా ఏసీబీ విచారించింది. 15 లక్షలు లంచం తీసుకుంటూ షేక్‌పేట ఆర్ఐ నాగార్జున ఏసీబీకి పట్టుబడ్డారు. షేక్ పేటలో వివాదస్పద స్థలం కోర్టు కేసులో ఉంది. ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు పెట్టారు. అయితే స్థల యజమాని లాక్‌డౌన్ […]
గ్రేటర్‌లో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. శనివారం పది గంటల పాటు మూడు చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. షేక్‌పేట ఎమ్మార్వో కార్యాలయం, తహసీల్దార్ సుజాత నివాసం, బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఆర్డీవో వసంతకుమారిని కూడా ఏసీబీ విచారించింది.
15 లక్షలు లంచం తీసుకుంటూ షేక్‌పేట ఆర్ఐ నాగార్జున ఏసీబీకి పట్టుబడ్డారు. షేక్ పేటలో వివాదస్పద స్థలం కోర్టు కేసులో ఉంది. ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు పెట్టారు. అయితే స్థల యజమాని లాక్‌డౌన్ కాలంలో బోర్డు తీసేశారు. స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థల యజమాని సయ్యద్ అబ్డుల్ నుంచి 50 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఎకరన్నర స్థలం తమదేనంటూ సయ్యద్ అబ్డుల్ కోర్టులో కేసు వేశారు. స్థల వివాదాన్ని పరిష్కరించేందుకు 50 లక్షల రూపాయలను నాగార్జున డిమాండ్ చేశారు. టోకెన్ అమౌంట్ కింద 15లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి నాగార్జున చిక్కారు. నాగార్జునతో పాటు బంజారాహిల్స్ ఎస్సై డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఎస్సై రవీందర్‌ను కూడా ఎసీబీ ప్రశ్నించింది.
మొత్తానికి ఏసీబీ కేసులో రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టుబడడం పెద్ద సంచలనంగా మారింది.