Telugu Global
NEWS

బ్రోకరిజంకు రాజధానిలో నజరానా

అమరావతిలో భూకుంభకోణంలో కొత్తకొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కాలువలు, రోడ్లకు సంబంధించిన భూములను టీడీపీ నేతలతో కలిసి కాజేసేందుకు ప్రయత్నించిన కేసులో డిప్యూటీ కలెక్టర్ మాధురీని పోలీసులు అరెస్ట్ చేశారు. సిట్‌ దర్యాప్తులో ఇలాంటి ఉదంతాలు ఇంకా అనేకం వెలుగులోకి వస్తున్నాయి. టీడీపీ హయాంలో ల్యాండ్ పూలింగ్‌ పనుల్లో కీలక పాత్ర పోషించిన మరికొందరు డిప్యూటీ కలెక్టర్ల పైనా సిట్ దృష్టి సారించింది. అవసరమైతే మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారించేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. ల్యాండ్ […]

బ్రోకరిజంకు రాజధానిలో నజరానా
X

అమరావతిలో భూకుంభకోణంలో కొత్తకొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కాలువలు, రోడ్లకు సంబంధించిన భూములను టీడీపీ నేతలతో కలిసి కాజేసేందుకు ప్రయత్నించిన కేసులో డిప్యూటీ కలెక్టర్ మాధురీని పోలీసులు అరెస్ట్ చేశారు.

సిట్‌ దర్యాప్తులో ఇలాంటి ఉదంతాలు ఇంకా అనేకం వెలుగులోకి వస్తున్నాయి.
టీడీపీ హయాంలో ల్యాండ్ పూలింగ్‌ పనుల్లో కీలక పాత్ర పోషించిన మరికొందరు డిప్యూటీ కలెక్టర్ల పైనా సిట్ దృష్టి సారించింది.

అవసరమైతే మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారించేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారు. ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇచ్చేలా రైతులపై ఒత్తిడి తేవడం, ఒప్పించడం వంటి పనులు చేసిన వారికి అక్రమ మార్గంలో నజరానాలు సమర్పించినట్టు సిట్ గుర్తించింది.

ఇలా బ్రోకరిజం చేసిన వారికి పూడ్చివేసిన చెరువు భూములు, రోడ్లు, కాలువలకు సంబంధించిన భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసినట్టు గుర్తించారు. ప్రభుత్వ భూములను కూడా ఇదే తరహాలో మధ్యవర్తిత్వం చేసిన వారికి నజరానా కింద కట్టబెట్టారు.

ప్రభుత్వానికి చెందిన మిగులు భూములు, అటవీ భూములను కూడా ఇలా కొందరు నాయకులకు దారాదత్తం చేసి… వాటిని వారి భూములుగా చూపించి ప్లాట్లు, కౌలు కాజేసినట్టు సిట్ ఆధారాలను సేకరించింది.

ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన ఆధారాల ప్రకారం ఇలా 150 ఎకరాలను బ్రోకర్లకు కట్టబెట్టినట్టు తేలింది. ఈ అక్రమ వ్యవహారాల్లో ఇన్‌చార్జ్‌లుగా పనిచేసిన డిప్యూటీ కలెక్టర్లతో పాటు రెవెన్యూ అధికారుల ప్రమేయం కూడా ఉన్నట్టు సిట్ గుర్తించింది.

ఒక రాజకీయ పార్టీకి చెందిన నేతలు ఇలా ల్యాండ్ పూలింగ్‌కు భూములు ఇచ్చేలా ఒప్పించి… ప్రభుత్వ భూములను నజరానాగా అందుకున్నట్టు సిట్ ఒక నిర్దారణకు వచ్చింది.

First Published:  5 Jun 2020 3:23 AM IST
Next Story