Telugu Global
NEWS

ఏపీలో టీచర్ల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్.... ప్రభుత్వ స్కూళ్లకు కార్పొరేట్‌ హంగులు

ఏపీలో టీచర్ల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పదో తరగతి పరీక్షలు అయిన తర్వాత, జులై చివరి వారంలో ఇవి చేపట్టాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. పూర్తి పారదర్శకంగా, ఆన్‌లైన్‌ విధానంలో బదిలీలు చేయాలన్నారు. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టు టీచర్లు ఉండాలని స్పష్టం చేశారు. స్కూళ్ళలో అవసరాలే ప్రాతిపదికగా బదిలీలు ఉండాలని స్పష్టం చేవారు. ఇటు ఏపీ ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వ స్కూళ్ల లో కొత్త సౌకర్యలు కల్పిస్తున్నారు. ప్రభుత్వ […]

ఏపీలో టీచర్ల బదిలీలకు గ్రీన్‌ సిగ్నల్.... ప్రభుత్వ స్కూళ్లకు కార్పొరేట్‌ హంగులు
X

ఏపీలో టీచర్ల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పదో తరగతి పరీక్షలు అయిన తర్వాత, జులై చివరి వారంలో ఇవి చేపట్టాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. పూర్తి పారదర్శకంగా, ఆన్‌లైన్‌ విధానంలో బదిలీలు చేయాలన్నారు. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టు టీచర్లు ఉండాలని స్పష్టం చేశారు. స్కూళ్ళలో అవసరాలే ప్రాతిపదికగా బదిలీలు ఉండాలని స్పష్టం చేవారు.

ఇటు ఏపీ ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దుతున్నారు. ప్రభుత్వ స్కూళ్ల లో కొత్త సౌకర్యలు కల్పిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా కల్పించే సౌకర్యాలను సీఎం జగన్‌ పరిశీలించారు.

కొత్త బెంచీలు, వాటర్‌ ప్లాంట్‌, కొత్త రకం గ్రీన్‌ బ్లాక్‌ బోర్డు, విద్యార్థులు మంచినీళ్లు తాగేందుకు కొత్త రకం వాటర్‌ క్యాన్ లను ప్రభుత్వ స్కూళ్లలో ఏర్పాటు చేయబోతున్నారు.

జులై చివరి నాటికి నాడు – నేడు కింద చేపట్టే పనులను పూర్తి చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత అధికారులతో సమీక్ష చేశారు.

2017లో అనుసరించిన పద్ధతుల కారణంగా 7,991 స్కూళ్లకు సింగిల్‌ టీచర్‌ను కేటాయించారని, వీటిలో చాలా వరకు మూతబడ్డాయని సమావేశంలో చర్చకు వచ్చింది. ప్రభుత్వ స్కూళ్లను ఎలా నిర్వీర్యం చేయాలి, విద్యార్థులను ప్రైవేటు పాఠశాలలకు ఎలా పంపాలన్న కోణంలో గతంలో నిర్ణయాలు జరిగాయని, దీనివల్ల ప్రభుత్వ విద్యా రంగానికి తీవ్ర నష్టం జరిగిందని వివరించారు సీఎం జగన్‌.

ఏపీలో ఆగస్ట్‌ 3 నుంచి పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి. దీంతో జూలై చివరి నాటికి నాడు-నేడు పనులు పూర్తి చేయాలని అధికారులకు సీఎం సూచించారు.. మరోవైపు బదిలీల కోసం ఉపాధ్యాయులు ఎవరి దగ్గరికీ వెళ్లాల్సిన అవసరం లేదని, ఆన్‌లైన్‌ ద్వారా బదిలీలు చేపడతామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్‌ చెప్పారు.

First Published:  4 Jun 2020 1:06 AM IST
Next Story