Telugu Global
NEWS

నేను గెలవడమే ప్రజలకు శాపమా? ఏడాదిలో రూపాయి అభివృద్ది లేదు...

వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాది అవుతున్నా అభివృద్ధి కనిపించడం లేదన్నారు. ఏడాది పూర్తయిందని కేకులు కట్ చేసుకుని సంబరాలు చేసుకోవడం మినహా ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదన్నారు. ముఖ్యమంత్రి చేసిన సిఫార్సులకే దిక్కు లేకుండాపోయిందని ఎమ్మెల్యే వాపోయారు. ఏడాదిలో తన నియోజకవర్గంలో ఒక్క రూపాయి అభివృద్ధి కూడా చేయలేకపోయామన్నారు. ” నేను ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడాది అయిపోయింది. నియోజకవర్గంలో ఒక్క రూపాయి అభివృద్ధి పని కూడా చేయలేకపోయాం. తాగునీరు సహా అభివృద్ధి […]

నేను గెలవడమే ప్రజలకు శాపమా? ఏడాదిలో రూపాయి అభివృద్ది లేదు...
X

వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏడాది అవుతున్నా అభివృద్ధి కనిపించడం లేదన్నారు. ఏడాది పూర్తయిందని కేకులు కట్ చేసుకుని సంబరాలు చేసుకోవడం మినహా ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదన్నారు.

ముఖ్యమంత్రి చేసిన సిఫార్సులకే దిక్కు లేకుండాపోయిందని ఎమ్మెల్యే వాపోయారు. ఏడాదిలో తన నియోజకవర్గంలో ఒక్క రూపాయి అభివృద్ధి కూడా చేయలేకపోయామన్నారు. ” నేను ఎమ్మెల్యేగా ఎన్నికై ఏడాది అయిపోయింది. నియోజకవర్గంలో ఒక్క రూపాయి అభివృద్ధి పని కూడా చేయలేకపోయాం. తాగునీరు సహా అభివృద్ధి పనులకు సంబంధించిన నివేదికలు ఏమైపోయాయో అంతుచిక్కడం లేదు. అసలు వెంకటగరి నియోజకవర్గం ఉందా? లేక తీసేశారా?. నేను ఇక్కడి నుంచి గెలవడమే ఇక్కడి ప్రజలకు శాపంగా మారిందా?. నామీద కక్ష కట్టి నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేస్తున్నారా?.” అని ప్రశ్నించారు.

సాగునీటి కోసం ఎస్‌ఎస్‌ కెనాల్ ప్రాజెక్టుకు ఇచ్చిన నివేదికలు ఏమయ్యాయో అంతుపట్టడం లేదన్నారు. అధికారులు నీరు కూడా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అధికారుల జేబులు నింపేవారి కోసం, అడుగులకు మడుగులొత్తేవారి కోసం ఇష్టమొచ్చినట్టు నీటిని వదిలి… వెంకటగిరి ప్రజలకు మాత్రం తాగునీరు లేకుండా చేస్తున్నారని ఆనం విమర్శించారు.

తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంతలా కళ్లు మూసుకున్న అధికారులను తాను ఎన్నడూ చూడలేదన్నారు. ఇకనైనా కళ్లు తెరిచి వెంకటగిరికి న్యాయం చేయాలని లేనిపక్షంలో పోరాటాలకు వెనుకాడబోనని స్పష్టం చేశారు.

మరో ఏడాది ఎదురుచూస్తానని… అప్పటికీ పరిస్థితులలో మార్పు రాకపోతే నిలదీయడానికి సిద్ధమన్నారు. సీఎం ప్రకటించే సంక్షేమ కార్యక్రమాలు నేరుగా వాలంటీర్ల ద్వారా ప్రజలకు చేరుతున్నాయే తప్ప… నేరుగా నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఒక్క రూపాయి కూడా లేదన్నారు.

First Published:  3 Jun 2020 9:03 PM GMT
Next Story