Telugu Global
NEWS

తదుపరి కేబినెట్ భేటీ విశాఖలో?

విశాఖకు పరిపాలన రాజధాని తరలింపు అంశం మరోసారి తెరపైకి వస్తోంది. ఒకేసారి ఉద్యోగులందరిని విశాఖకు తక్షణం తరలించకపోయినా… విశాఖను పరిపాలన రాజధాని చేసే విషయంలో వెనక్కు తగ్గడం లేదన్న సంకేతాలు ఇచ్చేందుకు జగన్‌మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక ఇందుకు సంబంధించి మంగళవారం ఒక కథనాన్ని ప్రచురించింది. విశాఖ నుంచి ప్రభుత్వం పనిచేసేందుకు సిద్ధంగా ఉందన్న సంకేతాలు పంపడంలో భాగంగా త్వరలో జరిగే కేబినెట్ భేటీని విశాఖ లో నిర్వహించే అవకాశం ఉందని ఆ పత్రిక […]

తదుపరి కేబినెట్ భేటీ విశాఖలో?
X

విశాఖకు పరిపాలన రాజధాని తరలింపు అంశం మరోసారి తెరపైకి వస్తోంది. ఒకేసారి ఉద్యోగులందరిని విశాఖకు తక్షణం తరలించకపోయినా… విశాఖను పరిపాలన రాజధాని చేసే విషయంలో వెనక్కు తగ్గడం లేదన్న సంకేతాలు ఇచ్చేందుకు జగన్‌మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారు. ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక ఇందుకు సంబంధించి మంగళవారం ఒక కథనాన్ని ప్రచురించింది.

విశాఖ నుంచి ప్రభుత్వం పనిచేసేందుకు సిద్ధంగా ఉందన్న సంకేతాలు పంపడంలో భాగంగా త్వరలో జరిగే కేబినెట్ భేటీని విశాఖ లో నిర్వహించే అవకాశం ఉందని ఆ పత్రిక వెల్లడించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతోందని వెల్లడించింది.

విశాఖను పరిపాలన రాజధానిని చేసే అంశంలో ముఖ్యమంత్రి వెనక్కు తగ్గే యోచనలో లేరని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. న్యాయపరమైన, మండలి పరమైన ఇబ్బందులు తొలగేలోగా విశాఖకు పరిపాలన రాజధానిని తరలింపుకు సంబంధించి ప్రణాళికలు రూపొందించాల్సిందిగా ముఖ్యమంత్రి అధికారులును ఆదేశించారని వివరించింది.

విశాఖ నుంచి తొలుత సీఎంవోను ప్రారంభించే యోచనలో సీఎం ఉన్నారు. అలా చేస్తే ఆ తర్వాత క్రమంగా అధికార యంత్రాంగం విశాఖకు తరలుతుంది. ఈ అంశంపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి కూడా జగన్‌ సమాచారం ఇచ్చారని పత్రిక వివరించింది.

First Published:  2 Jun 2020 6:30 AM IST
Next Story