Telugu Global
International

అమెరికాలో హింసాత్మకంగా "ఐ కాంట్‌ బ్రీత్‌" ఉద్యమం

అమెరికాలోని పలు రాష్ట్రాలు అల్లర్లతో అట్టుడుకుతున్నాయి. అనేక రాష్ట్రాలకు ఐకాంట్‌ బ్రీత్ ఉద్యమం పాకుతోంది. దీంతో నేషనల్ గార్డ్‌ను రంగంలోకి దింపారు. వైట్‌ హౌస్ చుట్టూ జాతీయ భద్రతాదళం మోహరించింది. ఎక్కడ చూసినా ఐ కాంట్ బ్రీత్ నినాదాలతో నిరసనకారులు హోరెత్తిస్తున్నారు. నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్‌ను ఒక తెల్లజాతీయుడైన పోలీసు అధికారి హత్య చేయడంతో నిరసన జ్వాల రగిలింది. పోలీసు అధికారి తన మెడపై కాలుతో నొక్కుతుంటే … ఊపిరి ఆడక ” ఐ కాంట్ బ్రీత్‌” […]

అమెరికాలో హింసాత్మకంగా ఐ కాంట్‌ బ్రీత్‌ ఉద్యమం
X

అమెరికాలోని పలు రాష్ట్రాలు అల్లర్లతో అట్టుడుకుతున్నాయి. అనేక రాష్ట్రాలకు ఐకాంట్‌ బ్రీత్ ఉద్యమం పాకుతోంది. దీంతో నేషనల్ గార్డ్‌ను రంగంలోకి దింపారు. వైట్‌ హౌస్ చుట్టూ జాతీయ భద్రతాదళం మోహరించింది. ఎక్కడ చూసినా ఐ కాంట్ బ్రీత్ నినాదాలతో నిరసనకారులు హోరెత్తిస్తున్నారు.

నల్లజాతీయుడైన జార్జ్ ఫ్లాయిడ్‌ను ఒక తెల్లజాతీయుడైన పోలీసు అధికారి హత్య చేయడంతో నిరసన జ్వాల రగిలింది. పోలీసు అధికారి తన మెడపై కాలుతో నొక్కుతుంటే … ఊపిరి ఆడక ” ఐ కాంట్ బ్రీత్‌” అంటూ ఆఖరి క్షణాల్లో నల్లజాతీయుడు జార్జిఫ్లాయిడ్ చేసిన విజ్ఞప్తినే నినాదంగా మార్చుకుని ” ఐ కాంట్ బ్రీత్” అంటూ అమెరికా యువత రోడ్డెక్కింది. ఈ ఆందోళనలో తెల్లజాతీయులు కూడా పాల్గొంటున్నారు.

నల్లజాతీయులను హత్య చేయడం ఇప్పటికైనా పోలీసులు మానుకోవాలంటూ నిరసనకారులు ప్రదర్శనలు చేశారు. ఈ ప్రదర్శనలు హింసాత్మకంగా మారుతున్నాయి. పోలీసులతో ఆందోళనకారులు తలబడుతున్నారు. చాలా ప్రాంతాల్లో రోడ్లపై విధ్వంసం జరుగుతోంది. ఫిలడెల్ఫియాలో 13 మంది పోలీసు అధికారులు ఈ హింసాత్మక నిరసనల్లో తీవ్రంగా గాయపడ్డారు. నిరసనకారులు కర్ఫ్యూను కూడా లెక్క చేయడం లేదు. దాంతో 11 రాష్ట్రాల్లో నేషనల్ గార్డ్‌ను రంగంలోకి దింపారు. శాన్‌ఫ్రాన్సిస్కో, అట్లాంటా, లూయి్‌సవిల్లె, లాస్‌ ఏంజెలెస్‌, పోర్ట్‌లాండ్‌, కొలంబియా తదితర 25 నగరాల్లో ఎమర్జెన్సీ కర్ఫ్యూలు విధించారు.

నిరసన ప్రదర్శనలను కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపైనా నిరసనకారులు దాడులు చేస్తున్నారు. ఇప్పటికే ఈ అల్లర్లలో ముగ్గురు చనిపోయారు. వందల సంఖ్యలో పౌరులు, పోలీసులు గాయపడ్డారు. ఇప్పటి వరకు 14వందల మంది నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.

అటు జార్జిఫ్లాయిడ్‌ను పొట్టనపెట్టుకున్న పోలీసు అధికారిపై ఆయన భార్య కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భర్త నుంచి విడాకులు ఇప్పించాలంటూ పోలీసు అధికారి భార్య కోర్టులో పిటిషన్ వేశారు. మృతుడి కుటుంబసభ్యులకు ఆమె ప్రగాడ సానుభూతి తెలిపారు.

First Published:  1 Jun 2020 5:10 PM IST
Next Story