ఓడిన పార్టీలు కోర్టుల ద్వారా రాజకీయాలను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాయి- కేంద్ర న్యాయశాఖ మంత్రి
కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదేపదే ఎన్నికల్లో ఓడిపోతున్న రాజకీయ పార్టీలు ఇప్పుడు కోర్టుల ద్వారా దేశ రాజకీయాలను నియంత్రించాలని చూడడం సరికాదని వ్యాఖ్యానించారు. విపక్షాలు కోర్టుల ద్వారా రాజకీయాలను శాసించజాలవని వ్యాఖ్యానించారు. ‘ఆజ్‌తక్’ ఈ-అజెండాలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. వలస కార్మికుల విషయంలో సుప్రీం కోర్టుకు వచ్చిన వారు ముందుగా క్షేత్రస్థాయిలో పరిస్థితులను మెరుగుపరిచేందుకు వారేం చేశారో చెప్పాలంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ […]
కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదేపదే ఎన్నికల్లో ఓడిపోతున్న రాజకీయ పార్టీలు ఇప్పుడు కోర్టుల ద్వారా దేశ రాజకీయాలను నియంత్రించాలని చూడడం సరికాదని వ్యాఖ్యానించారు. విపక్షాలు కోర్టుల ద్వారా రాజకీయాలను శాసించజాలవని వ్యాఖ్యానించారు. ‘ఆజ్‌తక్’ ఈ-అజెండాలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
వలస కార్మికుల విషయంలో సుప్రీం కోర్టుకు వచ్చిన వారు ముందుగా క్షేత్రస్థాయిలో పరిస్థితులను మెరుగుపరిచేందుకు వారేం చేశారో చెప్పాలంటూ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వ్యాఖ్యలను రవిశంకర్ సమర్థించారు.
ఒకప్పుడు దేశంపై ఎమర్జెన్సీని రుద్దిన వారే ఇప్పుడు మాట్లాడుతున్నారని విమర్శించారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు తాను కట్టుబడి ఉన్నామని… కానీ ఇదే సమయంలో తాను సీరియస్‌గా ఒక అంశాన్ని చెప్పాలనుకుంటున్నానని… ఎన్నికల్లో పదేపదే ఓడిపోతున్న పార్టీలు జాతీయ రాజకీయాలను కోర్టుల ద్వారా నియంత్రించే ప్రయత్నం చేయకూడదని రవిశంకర్ ప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దేశంలో కొన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాలకు ఇబ్బందులు సృష్టించేందుకు కోర్టుల్లో పదేపదే పిటిషన్లు వేస్తున్నాయన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.