Telugu Global
Cinema & Entertainment

ప్రభుత్వాన్ని నేను విమర్శించలేదు... వారిపై కేసులు పెడుతా " రావు రమేష్

ఇటీవల కొందరు వ్యక్తులు ప్రముఖుల పేర్లతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లను తెరిచి ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దాంతో చాలా మంది ఆ ప్రముఖులపై ఆగ్రహం వ్యక్తం చేయడం, అవి తమ అకౌంట్లు కాదని ప్రముఖులు వివరణ ఇచ్చుకోవడం పరిపాటిగా మారింది. ఇప్పుడీ జాబితాలో ప్రముఖ నటుడు రావు రమేష్ చేరారు. కొద్ది రోజుల క్రితం కొందరు వ్యక్తులు రావు రమేష్ పేరుతో ట్విట్టర్‌లో ఫేక్ అకౌంట్ తెరిచారు. దాని ద్వారా ఏపీ […]

ప్రభుత్వాన్ని నేను విమర్శించలేదు... వారిపై కేసులు పెడుతా  రావు రమేష్
X

ఇటీవల కొందరు వ్యక్తులు ప్రముఖుల పేర్లతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లను తెరిచి ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దాంతో చాలా మంది ఆ ప్రముఖులపై ఆగ్రహం వ్యక్తం చేయడం, అవి తమ అకౌంట్లు కాదని ప్రముఖులు వివరణ ఇచ్చుకోవడం పరిపాటిగా మారింది. ఇప్పుడీ జాబితాలో ప్రముఖ నటుడు రావు రమేష్ చేరారు.

కొద్ది రోజుల క్రితం కొందరు వ్యక్తులు రావు రమేష్ పేరుతో ట్విట్టర్‌లో ఫేక్ అకౌంట్ తెరిచారు. దాని ద్వారా ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ప్రజావేదిక కూల్చివేతలను ఆ అకౌంట్‌ ద్వారా తప్పుపట్టారు. ఏడాది పాలనలో వైసీపీ ప్రభుత్వంలో పోలవరంలో చేసిన పని ఎంత అని మరో పోస్టులో ప్రశ్నించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు అనుకూలంగా ఇటీవల హైకోర్టు తీర్పు ఇవ్వడంతో దానిపైనా ఈ ఫేక్ అకౌంట్ ద్వారా ట్వీట్ పెట్టారు. సరైన రోజు సరైన న్యాయం జరిగింది అంటూ వ్యాఖ్యానించారు.

ఈ అకౌంట్‌ అంశంపై కొందరు రావు రమేష్‌ను ఆరా తీశారు. దాంతో ఆయన షాక్ అయ్యారు. తనకు సోషల్ మీడియాలో అసలు అకౌంట్లే లేవని స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పెట్టిన పోస్టులు ఫేక్ అని చెప్పారు. తన పేరుతో తప్పుడు అకౌంట్‌ సృష్టించి పోస్టులు పెట్టిన వారిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఖాతాను ఈ మే నెలలోనే కొందరు వ్యక్తులు ప్రారంభించారు.

First Published:  31 May 2020 9:24 AM IST
Next Story